ఊరి చివర నాలుగు ఎకరాల స్థలంలో రెండు అంతస్తుల అధికారిక భవనం. మాలతి కారు దిగి చుట్టూ కలియ చూసింది. భవంతి చుట్టూ వున్నది తోట కాదు. అడవి. లతలు పూల మొక్కలు కాక మానులు, మోడులు వున్నా పెద్ద అడవి. లోపల ఉన్న భవంతి భూత్ బంగళాలా వుంది. పెచ్చులు ఊడిపోయి.
"మైగాడ్! అది మనుషులు ఉండటానికా, పిశాచాలకా?" అన్నాడు శ్రీధర్. మాలతి భర్త వంక చూసి నవ్వింది. మొదటిసారిగా అడిషనల్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు నిర్వర్తించబోతున్న శ్రీధర్ తనకు సాధికారంగా లభించిన ఆ భవంతిని, తన సిబ్బందిని, వాహనాన్ని భార్యను తృప్తిగా చూసుకున్నాడు. గర్వంగా అనిపించింది. పాతికేళ్ళకే తాను ఎంతో సాధించిన భావన కలిగింది.
- డా. ఆరేటి కృష్ణ