ఆడంబరాలకే అగ్రపీఠం వేసే ఆమె అహాన్ని సవాల్ చేస్తున్నట్లుగా కొడుక్కో సాదాసీదా సంబంధం ఖాయం చేశాడాయన. అనుక్షణం పెద్దకోడలి పుట్టింటివారి పెట్టుపోతల్ని పొగుడుతూ, కొత్త కోడల్ని న్యూనతపరుస్తూ... భర్తమీద ప్రతీకారం తీర్చుకుంటూ తన అహాన్ని చల్లార్చుకుంటూ ఉంటోందామె.
మొదట పిల్ల నల్లగా ఉందనీ, నచ్చలేదనీ అన్నవాళ్ళే డబ్బుకోసం మళ్ళీ అదే సంబంధం కావాలంటూ వస్తే వాళ్ళ ఆంతర్యాన్ని తెలుసుకోలేక ఆనందపడుతూ కూతుర్ని ఆ ఇంటి కోడలుగా పంపాడు మరో తండ్రి.
తామూ ఒకింటి కోడళ్లమే అని మరిచే అత్తలు... వారి ఆరళ్ళు... కోడళ్ళ కడగళ్ళు... చివరికి వింత మలుపులు తిరిగిన రెండు కుటుంబాల సంపూర్ణ కథాచిత్రణ.
హోతా పద్మినీదేవి నవల 'గడప' తప్పక చదవండి!
ఆడంబరాలకే అగ్రపీఠం వేసే ఆమె అహాన్ని సవాల్ చేస్తున్నట్లుగా కొడుక్కో సాదాసీదా సంబంధం ఖాయం చేశాడాయన. అనుక్షణం పెద్దకోడలి పుట్టింటివారి పెట్టుపోతల్ని పొగుడుతూ, కొత్త కోడల్ని న్యూనతపరుస్తూ... భర్తమీద ప్రతీకారం తీర్చుకుంటూ తన అహాన్ని చల్లార్చుకుంటూ ఉంటోందామె. మొదట పిల్ల నల్లగా ఉందనీ, నచ్చలేదనీ అన్నవాళ్ళే డబ్బుకోసం మళ్ళీ అదే సంబంధం కావాలంటూ వస్తే వాళ్ళ ఆంతర్యాన్ని తెలుసుకోలేక ఆనందపడుతూ కూతుర్ని ఆ ఇంటి కోడలుగా పంపాడు మరో తండ్రి. తామూ ఒకింటి కోడళ్లమే అని మరిచే అత్తలు... వారి ఆరళ్ళు... కోడళ్ళ కడగళ్ళు... చివరికి వింత మలుపులు తిరిగిన రెండు కుటుంబాల సంపూర్ణ కథాచిత్రణ. హోతా పద్మినీదేవి నవల 'గడప' తప్పక చదవండి!© 2017,www.logili.com All Rights Reserved.