ఇద్దరు మాంత్రికులు
కృష్ణానదికి ఎగువన ఏడు కిలోమీటర్ల దూరంలో, నల్లమల అడవికి దగ్గరలో ఉందా గూడెం మేమ్మడు. మొత్తం యాభై దాకా ఉంటాయి ఇండ్లు. అన్నీ వెదురు, బంక మట్టితో కట్టుకున్నవే. పైన రెల్లు లేదా జమ్ము కప్పు. ప్రతి ఇంట్లో కొన్ని | పశువులు - మేకలో, గొర్రెలో ఉండాల్సిందే. కొర్రలు, రాగులు, | జొన్నలు వంటి మెట్ట పంటలు పండించు కుంటారు. అందరూ పోడు చేసుకుంటారు. నీళ్ళు పారే అతి కొద్ది ప్రాంతంలో మాత్రం వరి పంట చల్లుకొని పండించుకుంటూ ఏడాదికి సరిపడా ధాన్యం ఇండ్లలో నిలవ చేసుకుంటారు గిరిజన బిడ్డలు. మిగులు పంటని * దగ్గరలోని పుటకంపేట సంతలో అమ్ముకుంటూ, ఇంటికి ఉప్పు, పప్పు వంటి నిత్యావసర సరుకులు - కుటుంబానికి సరిపడ బట్టలు తెచ్చు కుంటుంటారు. ఇంట్లో ధాన్యంతో పాటు అడవి జంతువుల ఎండు మాంసం, ఎండ పెట్టిన చేపలు కుండల్లో నిలవ చేసుకుంటారు. వీటితో పాటు ఒక కుండలో విప్పపూవుతో స్వంతంగా వండుకున్న సారా తప్పక ఉండాల్సిందే. పండుగలకు సారాతో పాటు, జీలుగు చెట్ల నుంచి తీసిన కల్లు కదం తొక్కాల్సిందే. వాళ్ళకు పెద్ద పండుగలంటే రెండే. జూన్, జూలై.........................
ఇద్దరు మాంత్రికులు కృష్ణానదికి ఎగువన ఏడు కిలోమీటర్ల దూరంలో, నల్లమల అడవికి దగ్గరలో ఉందా గూడెం మేమ్మడు. మొత్తం యాభై దాకా ఉంటాయి ఇండ్లు. అన్నీ వెదురు, బంక మట్టితో కట్టుకున్నవే. పైన రెల్లు లేదా జమ్ము కప్పు. ప్రతి ఇంట్లో కొన్ని | పశువులు - మేకలో, గొర్రెలో ఉండాల్సిందే. కొర్రలు, రాగులు, | జొన్నలు వంటి మెట్ట పంటలు పండించు కుంటారు. అందరూ పోడు చేసుకుంటారు. నీళ్ళు పారే అతి కొద్ది ప్రాంతంలో మాత్రం వరి పంట చల్లుకొని పండించుకుంటూ ఏడాదికి సరిపడా ధాన్యం ఇండ్లలో నిలవ చేసుకుంటారు గిరిజన బిడ్డలు. మిగులు పంటని * దగ్గరలోని పుటకంపేట సంతలో అమ్ముకుంటూ, ఇంటికి ఉప్పు, పప్పు వంటి నిత్యావసర సరుకులు - కుటుంబానికి సరిపడ బట్టలు తెచ్చు కుంటుంటారు. ఇంట్లో ధాన్యంతో పాటు అడవి జంతువుల ఎండు మాంసం, ఎండ పెట్టిన చేపలు కుండల్లో నిలవ చేసుకుంటారు. వీటితో పాటు ఒక కుండలో విప్పపూవుతో స్వంతంగా వండుకున్న సారా తప్పక ఉండాల్సిందే. పండుగలకు సారాతో పాటు, జీలుగు చెట్ల నుంచి తీసిన కల్లు కదం తొక్కాల్సిందే. వాళ్ళకు పెద్ద పండుగలంటే రెండే. జూన్, జూలై.........................© 2017,www.logili.com All Rights Reserved.