కృష్ణానది రేవుకు వెళ్ళేదారిలో పండు ముసలమ్మ కూర్చుని 'అయ్యా! ధర్మం చేయండి బాబూ, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు' అని అడుక్కోసాగింది. నది దాటేందుకు వెళుతున్న ఆస్తిగుప్తుడనే వ్యాపారిని కూడా అడిగిందామె. దానికాయన 'ఈ సృష్టి, స్థితి, లయ కారకుడైన భగవంతుడు సృష్టిలోని ఇన్ని కోట్ల ప్రాణులకు ఆహారాన్నిస్తూ నీకు మాత్రం ఎందుకు ఇవ్వడు? సాయంత్రం కల్లా తప్పక ఇస్తాడు! నేను దానం చేయనంత మాత్రాన నీకేం నష్టం లేదు' అంటూ ముందుకు సాగిపోయాడు. ఆ వెనుకే వచ్చాడు నాస్తి గుప్తుడు. అతన్ని కూడా యాచించింది ముసలమ్మా. 'ఛీ! ఛీ! ఎక్కడ చూసినా దేవుడి గురించిన స్మరణే. అందుకే ఈ ప్రజలిలా అజ్ఞానంలో, పేదరికంలో ఉన్నారు.
పాపం ఇంత తలచుకుంటున్నా ఈ దరిద్రులకేమన్నా మేలు జరుగుతుందా అంటే అదీ లేదు' అంటూ దేవుడ్ని అడ్డుపెట్టుకుని వ్యాపారం చేస్తున్న పురోహితుల్ని, స్వాములని కూడా విమర్శించసాగాడు. ఆ మాటలు వింటున్న ఆస్తిగుప్తుడు కలుగచేసుకుని 'అసలు భగవంతుడే లేకుంటే, నువ్వెలా పుట్టావు? ఎలా జీవిస్తున్నావు?' అని ఎదురు ప్రశ్న వేశాడు. తరువాత ఏం జరిగిందో ఆస్తి - నాస్తి అనే కథ చదివి తెలుసుకొనగలరు.
కృష్ణానది రేవుకు వెళ్ళేదారిలో పండు ముసలమ్మ కూర్చుని 'అయ్యా! ధర్మం చేయండి బాబూ, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు' అని అడుక్కోసాగింది. నది దాటేందుకు వెళుతున్న ఆస్తిగుప్తుడనే వ్యాపారిని కూడా అడిగిందామె. దానికాయన 'ఈ సృష్టి, స్థితి, లయ కారకుడైన భగవంతుడు సృష్టిలోని ఇన్ని కోట్ల ప్రాణులకు ఆహారాన్నిస్తూ నీకు మాత్రం ఎందుకు ఇవ్వడు? సాయంత్రం కల్లా తప్పక ఇస్తాడు! నేను దానం చేయనంత మాత్రాన నీకేం నష్టం లేదు' అంటూ ముందుకు సాగిపోయాడు. ఆ వెనుకే వచ్చాడు నాస్తి గుప్తుడు. అతన్ని కూడా యాచించింది ముసలమ్మా. 'ఛీ! ఛీ! ఎక్కడ చూసినా దేవుడి గురించిన స్మరణే. అందుకే ఈ ప్రజలిలా అజ్ఞానంలో, పేదరికంలో ఉన్నారు. పాపం ఇంత తలచుకుంటున్నా ఈ దరిద్రులకేమన్నా మేలు జరుగుతుందా అంటే అదీ లేదు' అంటూ దేవుడ్ని అడ్డుపెట్టుకుని వ్యాపారం చేస్తున్న పురోహితుల్ని, స్వాములని కూడా విమర్శించసాగాడు. ఆ మాటలు వింటున్న ఆస్తిగుప్తుడు కలుగచేసుకుని 'అసలు భగవంతుడే లేకుంటే, నువ్వెలా పుట్టావు? ఎలా జీవిస్తున్నావు?' అని ఎదురు ప్రశ్న వేశాడు. తరువాత ఏం జరిగిందో ఆస్తి - నాస్తి అనే కథ చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.