అతని చేతికి తన చీరచెంగు అందగానే లోహిత బాధగా అరిచింది.
"ఒద్దు. దయచేసి నన్ను వదిలిపెట్టు.”
అతను వదల్లేదు. బదులుగా వెనకనించి పకపక నవ్వు వినిపించింది. మరోసారి చీరచెంగుని వదిలేసాడు. లోహిత మళ్ళీ ముందుకు పరుగెత్తింది. కొద్దిక్షణాలు ఆమెని వెళ్ళనిచ్చి తర్వాత మళ్ళీ ఆమె వెంటపడ్డాడు.
లోహిత కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. కాలివేళ్ళకి రాళ్ళు తగిలి చిట్లి వాటి నించి రక్తం కారుతోంది. చుట్టుపక్కల పొదలకి, మొక్కలకున్న ముళ్ళకి ఆమె చీర తగిలి అది పోగులవుతోంది.
“భగవంతుడా!” లోహిత ఇక పరుగెత్తలేక కూలబడుతూ అరిచింది.
“లోహితా.” భర్త అరుపు వినిపించి ఆయాసంగా తల అటు తిప్పి చూసింది.
అతను తన భర్త బాలవ్యాస్ చేతులని వెనక్కి విరిచి ప్లాస్టిక్ వైర్తో కడుతున్నాడు. వెంటనే కారు వంక చూసింది. బోనెట్ ఎత్తి ఉంది. అతను కారు నించి ఆ వైర్ తెంపేసాడు. లోహిత చూస్తుండగానే బాలవ్యాస్ కాళ్ళని కూడా కదలకుండా కట్టేసాడు............
జాబిలి మీద సంతకం The great tragedy of life is not that men perish, but that they cease to love. W Somerset Maugham అతని చేతికి తన చీరచెంగు అందగానే లోహిత బాధగా అరిచింది. "ఒద్దు. దయచేసి నన్ను వదిలిపెట్టు.” అతను వదల్లేదు. బదులుగా వెనకనించి పకపక నవ్వు వినిపించింది. మరోసారి చీరచెంగుని వదిలేసాడు. లోహిత మళ్ళీ ముందుకు పరుగెత్తింది. కొద్దిక్షణాలు ఆమెని వెళ్ళనిచ్చి తర్వాత మళ్ళీ ఆమె వెంటపడ్డాడు. లోహిత కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. కాలివేళ్ళకి రాళ్ళు తగిలి చిట్లి వాటి నించి రక్తం కారుతోంది. చుట్టుపక్కల పొదలకి, మొక్కలకున్న ముళ్ళకి ఆమె చీర తగిలి అది పోగులవుతోంది. “భగవంతుడా!” లోహిత ఇక పరుగెత్తలేక కూలబడుతూ అరిచింది. “లోహితా.” భర్త అరుపు వినిపించి ఆయాసంగా తల అటు తిప్పి చూసింది. అతను తన భర్త బాలవ్యాస్ చేతులని వెనక్కి విరిచి ప్లాస్టిక్ వైర్తో కడుతున్నాడు. వెంటనే కారు వంక చూసింది. బోనెట్ ఎత్తి ఉంది. అతను కారు నించి ఆ వైర్ తెంపేసాడు. లోహిత చూస్తుండగానే బాలవ్యాస్ కాళ్ళని కూడా కదలకుండా కట్టేసాడు............© 2017,www.logili.com All Rights Reserved.