ఒకోసారి మీరు నిప్పుని రాజేసేప్పుడు గాలి దాన్ని అర్పేస్తుంది. దాన్ని చెడ్డ గాలి అనుకుంటారు. ఇంకోసారి నిప్పుని రాజేసేప్పుడు గాలి దాన్ని బాగా అంటుకుని మండేలా చేస్తుంది. అది మంచి గాలి అనుకుంటారు. మొదటి సందర్భం లోని గాలి మీ పథకాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి దానికి చెడ్డ గాలి అని, రెండో సందర్భంలోని గాలి మీ పథకానికి అనుకూలంగా పని చేస్తుంది కాబట్టి దానికి మంచి గాలి అని పేరు పెడతారు.
ఈ ఉదాహరణని బట్టి పరిస్థితుల్ని, మనుషుల్ని, వస్తువులని మనం చెడ్డదా లేదా మంచిదా అని నిర్ణయించే విధానం సాధారణంగా అది మనకి అనుకూలమైందా కాదా అన్న దాని మీద ఆధారపడుతుంది అని అర్థం అవుతుంది. మనకి మేలు చేస్తే అది మంచిది. హాని చేస్తే అది చెడ్డది. ఇది సరి కాదు. కాని అసలైన మంచి చెడ్డలని సరిగ్గా నిర్ణయించేది ఒక్క పరమాత్మే. ఆయన వాటిని అనేక మతాల ద్వారా తెలియజేశాడు. అందుకు ప్రవక్తలు ఆయనకీ సహాయపడ్డారు. ఆయన అన్ని మతాలలో చెప్పిన వాటిల్లో ఎలాంటి భేదం లేదు. చెప్పే కోణంలో మార్పు ఉండవచ్చు. ఈ నేపథ్యంలో ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోవాలి.
రెండు దీపాలు ఉన్నా వెలుగు ఒక్కటే. ఏ వెలుగు ఏ దీపం లోంచి వస్తుందో ఎలా విడదీసి చూడలేమో అలాగే రెండు మతాలకి చెందిన దైవం, రెండు మతాలూ బోధించేవి కూడా ఒకటే అని తెలుసుకోవాలి. ప్రతీ మతం మనిషి మంచివాడుగా అవడానికే సహాయం చేస్తుంది. అనేక శతాబ్దాలుగా కోట్లాది మనుషులు తమ మతాల ద్వారా శాంతిని అనుభవిస్తున్నారు. ఈ పుస్తకాన్ని మీరు పూర్తి చేశాక ప్రతీ మతం దాని ప్రత్యేక దారిలో అది అద్భుతమైనది అని అంగీకరిస్తే, మీరు ఇంకాస్త మృదువుగా ప్రవర్తించడం, మతసహనం అలవరచుకుంటే, అప్పుడు ఈ పుస్తకం లక్ష్యం నెరవేరినట్లే.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి
ఒకోసారి మీరు నిప్పుని రాజేసేప్పుడు గాలి దాన్ని అర్పేస్తుంది. దాన్ని చెడ్డ గాలి అనుకుంటారు. ఇంకోసారి నిప్పుని రాజేసేప్పుడు గాలి దాన్ని బాగా అంటుకుని మండేలా చేస్తుంది. అది మంచి గాలి అనుకుంటారు. మొదటి సందర్భం లోని గాలి మీ పథకాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి దానికి చెడ్డ గాలి అని, రెండో సందర్భంలోని గాలి మీ పథకానికి అనుకూలంగా పని చేస్తుంది కాబట్టి దానికి మంచి గాలి అని పేరు పెడతారు. ఈ ఉదాహరణని బట్టి పరిస్థితుల్ని, మనుషుల్ని, వస్తువులని మనం చెడ్డదా లేదా మంచిదా అని నిర్ణయించే విధానం సాధారణంగా అది మనకి అనుకూలమైందా కాదా అన్న దాని మీద ఆధారపడుతుంది అని అర్థం అవుతుంది. మనకి మేలు చేస్తే అది మంచిది. హాని చేస్తే అది చెడ్డది. ఇది సరి కాదు. కాని అసలైన మంచి చెడ్డలని సరిగ్గా నిర్ణయించేది ఒక్క పరమాత్మే. ఆయన వాటిని అనేక మతాల ద్వారా తెలియజేశాడు. అందుకు ప్రవక్తలు ఆయనకీ సహాయపడ్డారు. ఆయన అన్ని మతాలలో చెప్పిన వాటిల్లో ఎలాంటి భేదం లేదు. చెప్పే కోణంలో మార్పు ఉండవచ్చు. ఈ నేపథ్యంలో ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోవాలి. రెండు దీపాలు ఉన్నా వెలుగు ఒక్కటే. ఏ వెలుగు ఏ దీపం లోంచి వస్తుందో ఎలా విడదీసి చూడలేమో అలాగే రెండు మతాలకి చెందిన దైవం, రెండు మతాలూ బోధించేవి కూడా ఒకటే అని తెలుసుకోవాలి. ప్రతీ మతం మనిషి మంచివాడుగా అవడానికే సహాయం చేస్తుంది. అనేక శతాబ్దాలుగా కోట్లాది మనుషులు తమ మతాల ద్వారా శాంతిని అనుభవిస్తున్నారు. ఈ పుస్తకాన్ని మీరు పూర్తి చేశాక ప్రతీ మతం దాని ప్రత్యేక దారిలో అది అద్భుతమైనది అని అంగీకరిస్తే, మీరు ఇంకాస్త మృదువుగా ప్రవర్తించడం, మతసహనం అలవరచుకుంటే, అప్పుడు ఈ పుస్తకం లక్ష్యం నెరవేరినట్లే. - మల్లాది వెంకట కృష్ణమూర్తి© 2017,www.logili.com All Rights Reserved.