"లంచం పుచ్చుకునేవాడినీ, ఇచ్చేవాడినీ ఇద్దరినీ శిక్షిస్తారు, బ్లాక్ లో వస్తువులు అమ్మేవాళ్ళని, కొనేవాళ్ళని దొంగ సరుకులని కొనేవాళ్ళని, అమ్మేవాళ్ళని, ఇద్దరినీ శిక్షిస్తారు. కానీ ఈ ఆడపిల్ల విషయంలో మటుకు, అసలు నేరస్తుల్ని వదిలేసి పావులని, ఆడపావులని పట్టుకుంటున్నారు.
ఆ విజిలెన్స్ హోమ్ గేట్లలోకి అనేకమంది ఆడపిల్లలు దగాపడినవారూ, ఏ మచ్చా లేనివారూ కూడా వస్తూపోతూ ఉంటారు. అదొక నారీజన ప్రపంచం. పరిస్థితులతో పోరాడి తమ జీవితాలని చక్కబరుచుకున్న వాళ్ళూ ఉన్నారు; గానుక ఎద్దుల్లాగా గిరగిర తిరుగుతూ మళ్ళీ ఆ ఆభాగ్య జీవితాల్లోకి వెళ్ళిపోతున్న వాళ్ళూ ఉన్నారు. ఆ గేట్లలోకి వచ్చిన ప్రతి ఆడపిల్లనీ చక్కదిద్దాలనీ, ఆమెకి ఆర్ధిక సుస్థిరత్వం కల్పించాలనీ, సూపరెంటు కృష్ణవేణి తపన. ఆమె ఉద్యోగ నిర్వహణలో జయాపజయాలు పడుగుపేకల్లా కలిసి పోయాయి. ఒక 'లక్ష్మి' ఆమెకి ఆత్మ తృప్తినిస్తే, ఒక 'జయ' ఆమెని ఆత్మపరీక్ష చేసుకోమంటుంది. ఎండమావుల వంటి స్వేచ్ఛను వెతుక్కుంటూ వెళ్ళిపోయింది జయ. తాత్కాలికంగా కనిపించే ఆ స్వేచ్ఛకోసం శాశ్వతంగా ఎందుకు రెక్కలు విరుచుకుంటున్నారు? ఇది పంజరం అని గిలగిల్లాడి. అగ్ని పంజరంలో ఇరుక్కునే ఈ పిల్లలని తను మార్చగలదా? అనుకుంది కృష్ణవేణి.
మాలతీ చందూర్ వ్రాసిన ప్రతి కధా, నవల, వ్యాసం, అన్నీ ఇంటింటికీ మామిడి తోరణాలై, మణిదీపాలై ప్రకాశిస్తుంటాయి, ఆమె కలం నుండి వెలువడిన మరో మణిపూస, "జయ - లక్ష్మి".
- మాలతి చందూర్
"లంచం పుచ్చుకునేవాడినీ, ఇచ్చేవాడినీ ఇద్దరినీ శిక్షిస్తారు, బ్లాక్ లో వస్తువులు అమ్మేవాళ్ళని, కొనేవాళ్ళని దొంగ సరుకులని కొనేవాళ్ళని, అమ్మేవాళ్ళని, ఇద్దరినీ శిక్షిస్తారు. కానీ ఈ ఆడపిల్ల విషయంలో మటుకు, అసలు నేరస్తుల్ని వదిలేసి పావులని, ఆడపావులని పట్టుకుంటున్నారు. ఆ విజిలెన్స్ హోమ్ గేట్లలోకి అనేకమంది ఆడపిల్లలు దగాపడినవారూ, ఏ మచ్చా లేనివారూ కూడా వస్తూపోతూ ఉంటారు. అదొక నారీజన ప్రపంచం. పరిస్థితులతో పోరాడి తమ జీవితాలని చక్కబరుచుకున్న వాళ్ళూ ఉన్నారు; గానుక ఎద్దుల్లాగా గిరగిర తిరుగుతూ మళ్ళీ ఆ ఆభాగ్య జీవితాల్లోకి వెళ్ళిపోతున్న వాళ్ళూ ఉన్నారు. ఆ గేట్లలోకి వచ్చిన ప్రతి ఆడపిల్లనీ చక్కదిద్దాలనీ, ఆమెకి ఆర్ధిక సుస్థిరత్వం కల్పించాలనీ, సూపరెంటు కృష్ణవేణి తపన. ఆమె ఉద్యోగ నిర్వహణలో జయాపజయాలు పడుగుపేకల్లా కలిసి పోయాయి. ఒక 'లక్ష్మి' ఆమెకి ఆత్మ తృప్తినిస్తే, ఒక 'జయ' ఆమెని ఆత్మపరీక్ష చేసుకోమంటుంది. ఎండమావుల వంటి స్వేచ్ఛను వెతుక్కుంటూ వెళ్ళిపోయింది జయ. తాత్కాలికంగా కనిపించే ఆ స్వేచ్ఛకోసం శాశ్వతంగా ఎందుకు రెక్కలు విరుచుకుంటున్నారు? ఇది పంజరం అని గిలగిల్లాడి. అగ్ని పంజరంలో ఇరుక్కునే ఈ పిల్లలని తను మార్చగలదా? అనుకుంది కృష్ణవేణి. మాలతీ చందూర్ వ్రాసిన ప్రతి కధా, నవల, వ్యాసం, అన్నీ ఇంటింటికీ మామిడి తోరణాలై, మణిదీపాలై ప్రకాశిస్తుంటాయి, ఆమె కలం నుండి వెలువడిన మరో మణిపూస, "జయ - లక్ష్మి". - మాలతి చందూర్© 2017,www.logili.com All Rights Reserved.