"ఎవరు ఏ మార్గం తొక్కినా, గమ్యం ఒక్కటే. జీవితంలో పరిపూర్ణత, ఒక తృప్తి, అది లభించనప్పుడు పెళ్ళే కావాలని ఎక్కడుంది! సంసారం సాగరం అందరికి అక్కర్లేదు. కొందరికే కావాలి. కృష్ణవేణి ఆ కొందరి లాంటిది కాదు."
ఈ విజిలెన్స్ హోమ్ గేట్లలోకి వచ్చిన ప్రతి ఆడపిల్లని చక్కదిద్ది, ఆమెకి ఆర్ధిక సుస్థిరత్వం కల్పించాలని సూపరెంటు కృష్ణవేణి తపన. ఆమె ఉద్యోగ నిర్వహణలో జయాపజయాలు పడుగుపేకల్లా కలిసిపోయాయి. కళ్ళు తెరచుకుని నిస్సంకోచంగా, ఆ పాత జీవితంలోకి వెళ్ళిపోయే 'గీత', నినాదాలకీ, ఉద్యమాలకీ బలి అయిన 'మంజుల'; పర్వతాలూ, దేశాలూ దాటి ఆంధ్రాకి వచ్చి తెలుగు వారితో తనకి జన్మజన్మల భాంధవ్యం ఉన్నదని నమ్మే 'వెలెంటినా' వీరంతా ఒక పూలదండలోని పూలు... విజిలెన్స్ హోమ్ లోని స్త్రీలందరినీ ఒక అపూర్వ అనుబంధం కట్టివేస్తున్నది. అదే మమతానుబంధం. 'సుశీల' రెండో పిల్లని మొదటిసారి హోమ్ కి తీసుకొచ్చినప్పుడు మమతానురాగాలకి మొహం వాచిన యీ స్త్రీలంతా ఆ చిన్నదాని చుట్టూ చేరతారు. హోమ్ లో పెళ్లి చేసుకున్న 'వేలాయుధం' కూతురికి అంపకాలు పెడుతున్నప్పుడు రక్త సంబంధీకులు కంటే ఎక్కువగా బాధపడతారు. ఇలా మనం కూడా అందరికీ సహాయపడాలనే భావన మనలో కలుగుజేస్తు౦దీ నవల.
- మాలతీ చందూర్
"ఎవరు ఏ మార్గం తొక్కినా, గమ్యం ఒక్కటే. జీవితంలో పరిపూర్ణత, ఒక తృప్తి, అది లభించనప్పుడు పెళ్ళే కావాలని ఎక్కడుంది! సంసారం సాగరం అందరికి అక్కర్లేదు. కొందరికే కావాలి. కృష్ణవేణి ఆ కొందరి లాంటిది కాదు." ఈ విజిలెన్స్ హోమ్ గేట్లలోకి వచ్చిన ప్రతి ఆడపిల్లని చక్కదిద్ది, ఆమెకి ఆర్ధిక సుస్థిరత్వం కల్పించాలని సూపరెంటు కృష్ణవేణి తపన. ఆమె ఉద్యోగ నిర్వహణలో జయాపజయాలు పడుగుపేకల్లా కలిసిపోయాయి. కళ్ళు తెరచుకుని నిస్సంకోచంగా, ఆ పాత జీవితంలోకి వెళ్ళిపోయే 'గీత', నినాదాలకీ, ఉద్యమాలకీ బలి అయిన 'మంజుల'; పర్వతాలూ, దేశాలూ దాటి ఆంధ్రాకి వచ్చి తెలుగు వారితో తనకి జన్మజన్మల భాంధవ్యం ఉన్నదని నమ్మే 'వెలెంటినా' వీరంతా ఒక పూలదండలోని పూలు... విజిలెన్స్ హోమ్ లోని స్త్రీలందరినీ ఒక అపూర్వ అనుబంధం కట్టివేస్తున్నది. అదే మమతానుబంధం. 'సుశీల' రెండో పిల్లని మొదటిసారి హోమ్ కి తీసుకొచ్చినప్పుడు మమతానురాగాలకి మొహం వాచిన యీ స్త్రీలంతా ఆ చిన్నదాని చుట్టూ చేరతారు. హోమ్ లో పెళ్లి చేసుకున్న 'వేలాయుధం' కూతురికి అంపకాలు పెడుతున్నప్పుడు రక్త సంబంధీకులు కంటే ఎక్కువగా బాధపడతారు. ఇలా మనం కూడా అందరికీ సహాయపడాలనే భావన మనలో కలుగుజేస్తు౦దీ నవల. - మాలతీ చందూర్
© 2017,www.logili.com All Rights Reserved.