గతంలో నేను కీ షార్ట్ ఫిల్మ్ ఆత్మహత్య మీద తీసే క్రమంలో.. మరణం గురించిన కొన్ని విషయాలు.. కొన్ని కొటేషన్లు సేకరించాను. 'మోరీతో మంగళవారం' అనే పుస్తకం చదవడం తటస్థించింది! చాలా తమాషా పుస్తకం. ఇన్నేళ్ళ తర్వాత ఓ కుర్రాడు 'మరణంతో అనుభవాలు' అన్న పుస్తకం చదివి ముందుమాట రాయమంటే ఆశ్చర్యపోయా! ఎమెస్కో వాళ్ళు వేస్తున్నారంటే ఆనందించా. విషయంమ లేకపోతే ఎమెస్కో విజయకుమార్ ఇంత సాహసం చేయరు!
చదవడం మొదలెట్టా.. చిత్రంగా ఉంది. ఒక మరణానుభావం లోంచి.. ఓ ప్రేమకథై.. తర్వాత మరో మరణంతో భగ్నమై ఫిలాసఫీ వైపు వెళ్తూ ఇదో కొత్త తరహా నవల. అన్ని రసాలూ ఉన్నా అతి సహజంగా ఉంటూ పాఠకుడికి ప్రతి పేజీ ఉత్కంఠ కలిగిస్తుంది! పాఠకుడికి మేధకి కొన్ని కొత్త కిటికీల్ని తెరుస్తుంది! ఇది ఆషామాషీగా రాసింది మాత్రం కాదు. ఎంతో రీసెర్చి మరెంతో శ్రమ ఎంతో విషయసేకరణ అన్నిటినీ మించి చాలా చాలా ఇష్టంగా రాసిన నవల.
ఇదే ఇంగ్లీషులో నవలగా వస్తే ఉపాధ్యాయుల విజయశేఖర్ 'ఓవర్ నైట్ స్టార్ రైటర్' అయ్యే అవకాశం ఉంది! తమాషా ఏమిటంటే ఈ పుస్తకం గలగలా చదవడం కుదరదు. అలా అని ఆపడమూ కుదరదూ.. ఆస్వాదిస్తూ.. అనుభవిస్తూ.. ఆనందిస్తూ.. పేజీలు తిప్పడమే! మరణం మీద రాసిన కుర్రాణ్ణి 'చిరంజీవ' అని ఆశీర్వదిస్తూ..
- తనికెళ్ళభరణి
గతంలో నేను కీ షార్ట్ ఫిల్మ్ ఆత్మహత్య మీద తీసే క్రమంలో.. మరణం గురించిన కొన్ని విషయాలు.. కొన్ని కొటేషన్లు సేకరించాను. 'మోరీతో మంగళవారం' అనే పుస్తకం చదవడం తటస్థించింది! చాలా తమాషా పుస్తకం. ఇన్నేళ్ళ తర్వాత ఓ కుర్రాడు 'మరణంతో అనుభవాలు' అన్న పుస్తకం చదివి ముందుమాట రాయమంటే ఆశ్చర్యపోయా! ఎమెస్కో వాళ్ళు వేస్తున్నారంటే ఆనందించా. విషయంమ లేకపోతే ఎమెస్కో విజయకుమార్ ఇంత సాహసం చేయరు! చదవడం మొదలెట్టా.. చిత్రంగా ఉంది. ఒక మరణానుభావం లోంచి.. ఓ ప్రేమకథై.. తర్వాత మరో మరణంతో భగ్నమై ఫిలాసఫీ వైపు వెళ్తూ ఇదో కొత్త తరహా నవల. అన్ని రసాలూ ఉన్నా అతి సహజంగా ఉంటూ పాఠకుడికి ప్రతి పేజీ ఉత్కంఠ కలిగిస్తుంది! పాఠకుడికి మేధకి కొన్ని కొత్త కిటికీల్ని తెరుస్తుంది! ఇది ఆషామాషీగా రాసింది మాత్రం కాదు. ఎంతో రీసెర్చి మరెంతో శ్రమ ఎంతో విషయసేకరణ అన్నిటినీ మించి చాలా చాలా ఇష్టంగా రాసిన నవల. ఇదే ఇంగ్లీషులో నవలగా వస్తే ఉపాధ్యాయుల విజయశేఖర్ 'ఓవర్ నైట్ స్టార్ రైటర్' అయ్యే అవకాశం ఉంది! తమాషా ఏమిటంటే ఈ పుస్తకం గలగలా చదవడం కుదరదు. అలా అని ఆపడమూ కుదరదూ.. ఆస్వాదిస్తూ.. అనుభవిస్తూ.. ఆనందిస్తూ.. పేజీలు తిప్పడమే! మరణం మీద రాసిన కుర్రాణ్ణి 'చిరంజీవ' అని ఆశీర్వదిస్తూ.. - తనికెళ్ళభరణి© 2017,www.logili.com All Rights Reserved.