అరకు కాఫీలాంటి అనుభవం
ఒకింత సరదాగా చెప్పుకోవాలంటే తెలుగులో హయాం అనే పదం ఉంది. వాస్తవానికి యిది పార్సీ పదం. అయితే తెలుగులోకి వచ్చి చేరింది. ఈ పదం ఉపయోగం పరిమితమైంది అది పరిపాలనా రంగంలో ఉన్న వారికి పరిచయమైన పదం. ప్రతి రాజు/ పరిపాలకుడు వచ్చినప్పుడల్లా తన హయాం మొదలవుతుంది. రాజరికం పోయినా పరిపాలనలో నుంచి పోలేదు. అధికారులకు కూడా సంక్రమించింది. అలా అది రవి ప్రకాశ్ గారికి కూడా సంక్రమించింది. ఆయన హయాంలో ఏమైందనేది మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం ఎలా?
ఈ రోజు 'ఎకనమిక్ టైమ్స్' అనే ఆర్థిక విశ్లేషణ దినపత్రికల్లో ఓ వార్త చదివాను. అదేమిటంటే ఆదివాసులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు కూడా వ్యవసాయ రుణపరపతి అందించాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నదని. బ్రిటీష్ ప్రభుత్వం ఉన్నంత వరకు పోడు వ్యవసాయం మీద ఆంక్షలు లేవు. స్వాతంత్య్రానంతరం పోడు వ్యవసాయాన్ని నిరుత్సాహపరచే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే పోడు వ్యవసాయం తగ్గడం లేదు. ఎందుకంటే ఆదివాసి ప్రాంతాలలో, పల్లపు ప్రాంత వ్యాపారుల ఉనికి విస్తరించాక అక్కడి భూమి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాక, భూమి పోయిన లోతట్టు ప్రాంతపు ఆదివాసికి మిగిలిన ప్రత్యామ్నాయం యింకాస్త అడవి లోపలికి వెళ్ళి పోడు వ్యవసాయం చేయడమే!............
అరకు కాఫీలాంటి అనుభవం ఒకింత సరదాగా చెప్పుకోవాలంటే తెలుగులో హయాం అనే పదం ఉంది. వాస్తవానికి యిది పార్సీ పదం. అయితే తెలుగులోకి వచ్చి చేరింది. ఈ పదం ఉపయోగం పరిమితమైంది అది పరిపాలనా రంగంలో ఉన్న వారికి పరిచయమైన పదం. ప్రతి రాజు/ పరిపాలకుడు వచ్చినప్పుడల్లా తన హయాం మొదలవుతుంది. రాజరికం పోయినా పరిపాలనలో నుంచి పోలేదు. అధికారులకు కూడా సంక్రమించింది. అలా అది రవి ప్రకాశ్ గారికి కూడా సంక్రమించింది. ఆయన హయాంలో ఏమైందనేది మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం ఎలా? ఈ రోజు 'ఎకనమిక్ టైమ్స్' అనే ఆర్థిక విశ్లేషణ దినపత్రికల్లో ఓ వార్త చదివాను. అదేమిటంటే ఆదివాసులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు కూడా వ్యవసాయ రుణపరపతి అందించాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నదని. బ్రిటీష్ ప్రభుత్వం ఉన్నంత వరకు పోడు వ్యవసాయం మీద ఆంక్షలు లేవు. స్వాతంత్య్రానంతరం పోడు వ్యవసాయాన్ని నిరుత్సాహపరచే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే పోడు వ్యవసాయం తగ్గడం లేదు. ఎందుకంటే ఆదివాసి ప్రాంతాలలో, పల్లపు ప్రాంత వ్యాపారుల ఉనికి విస్తరించాక అక్కడి భూమి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాక, భూమి పోయిన లోతట్టు ప్రాంతపు ఆదివాసికి మిగిలిన ప్రత్యామ్నాయం యింకాస్త అడవి లోపలికి వెళ్ళి పోడు వ్యవసాయం చేయడమే!............© 2017,www.logili.com All Rights Reserved.