పెట్టుబడి గ్రంధం గురించి ఒక సందర్భంలో మర్క్స్ ఇలా అంటడు. శాస్త్రాన్ని అర్ధం చేసుకోడానికి రాజమార్గం లేదు. నిటారు మార్గాలను అధిరోహించడానికి సిద్ధపడేవారు మాత్రమే ఆ శాస్త్ర విజ్ఞాన శిఖరాల నుంచి ప్రసవించే వెలుగును అందుకోగలుగుతారు..
ఆధునిక సమాజపు ఆర్థిక చలన సూత్రాలను పెట్టుబడి గ్రంధం వెల్లడించి విశ్లేషిస్తుంది. మర్క్స్ మహత్తర సిద్ధాంత ఆవిష్కరణలు చారిత్రిక భౌతికవాదం అదనపు విలువ సిద్ధాంతం. పెట్టుబడిదారీ వ్యవస్థ పుట్టుక అభివృద్ధి ఆ క్రమంలో రూపుదిద్దుకొని ఇతర వ్యవస్థలు భావజాలాలను పెట్టుబడి గ్రంధం తెలియజేస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ సరుకుల ఉత్పత్తి వ్యవస్థ. అందుకే పెట్టుబడి గ్రంధం సరుకు స్వభావ విశ్లేషణతో మొదలవుతుంది. సరుకుల ఉత్పత్తిలో అదనపు విలువను పెట్టుబడిదారీ వర్గం దోచుకుంటుంది. శ్రమకు పెట్టుబడికి ఉన్న సంబంధంలో అదనపు విలువ దోపిడీ అనే అతి కీలకమైన విషయం తెలుసుకోవాలంటే పెట్టుబడి చదవాల్సిందే. అయితే మర్క్స్ అన్నట్లు ఇలాంటి శాస్త్ర గ్రంథాలను చదవడం చాల మందికి కష్టం. కాబట్టి అలాంటి పుస్తకాల నేపథ్యం సారాంశం సులభంగా తెలియజెప్పే పుస్తకాల ఎన్నో కావాలి.
- ముక్తవరం పార్థసారథి