నందిని
చోపడ్ పట్టీ ఇలాకాలోకి ఎంటర్ కాగానే ఒక వీధి కార్నర్లో ఆటో ఆపించాడు శ్యామసుందర్.
ఆటో ఆగిన చోటుకు సరిగ్గా వంద గజాల దూరంలో ఉంది ఒక కాకా హోటల్. అక్కడ ఆరుబయట బల్లమీద కూచునుందొక శాల్తీ.
వయసు పాతిక మించదు. బక్కపల్చ ప్రాణి. జీబురు తల. మాసిన పైజామా జుబ్బా ధరించి వున్నాడు. వాడి పేరు కాళి. కాకా హోటల్ ఓనర్ అందించిన టీ గ్లాసు అందుకుని ఆర్చుకు ఆర్చుకు తాగుతున్న కాళి దృష్టి అప్పుడే ఆగిన ఆటో మీద పడింది.
ఆటో దిగిన యువకుడ్ని చూస్తూ నిటారుగా కూచున్నాడు. శ్యామసుందర్ వేలట్ తీసి ఆటోవాలాకు అయిదువందల నోటు ఇచ్చాడు. వాడి ముఖం చింకి చేటయింది.
"సాబ్ వెయిట్ చేయమంటారా?" ఎంతో వినయంగా అడిగాడు ఆటోవాలా.
"లేటయినా ఫరవాలేదా?” వేలట్ జేబులోకి తోసి సిగరెట్ తీసి ముట్టించుకుని అడిగాడు.
“ఎంత లేటు కావచ్చు సార్?” వెంటనే అడిగాడు ఆటోవాలా.
“అరగంట కావచ్చు లేదా ఆరుగంటలు కావచ్చు.”.............
© 2017,www.logili.com All Rights Reserved.