అవి వర్షారంభదినాలు. సాయంకాలమయింది. విష్ణుపురం నుంచి మంధారణానికి వెళ్ళే మార్గంలో ఒక యువకుడు గుర్రం పైన సవారీ అయి, ఒంటరిగా ప్రయాణిస్తున్నాడు. అతను వెళ్ళే ప్రాంతం ఒక అంతులేని మైదానం. త్వరలో చీకటి పడిపోతుందన్న ఉద్దేశంతో ఆ యువకుడు గుర్రాన్ని మరింత వేగంగా నడిపించాడు.
అతను మైదానాన్ని దాటేసరికి సూర్యుడస్తమించి, మేఘాలు కప్పిన ఆకాశాన్ని చీకట్లు ఆవరించాయి. త్వరలోనే గుర్రానికి దారి కనిపించకుండా పోయింది. మధ్య మధ్య ఆకాశాన వచ్చే మెరుపుల కాంతిలో అతను దారి చూసుకుంటూ ముందుకుసాగాడు. మరి కొంచెం సేపటికల్లా ఉధృతంగా గాలి వీచింది. దానితోపాటు వాన కూడా సాగింది.. యువకుడు తానై గుర్రాన్ని నడపలేక, కళ్ళెం విడిచేసి, గుర్రాన్ని దాని ఇచ్ఛ ప్రకారం పోనిచ్చాడు.
కొంత దూరం ఇలా పోగా గుర్రం కాలికి రాతిగట్టులాంటిదేదో తగిలింది. అంతలోనే మెరుపు మెరిసి, యువకుడికి తెల్లని కట్టడం ఏదో కనిపించింది. అతను గుర్రం దిగి చూసేసరికి, గుర్రం కాలికి తగిలినది రాతి మెట్లని తెలిసింది. అతను గుర్రాన్ని అక్కడే వదిలి, ఎక్కడన్నా ఆశ్రయం దొరుకుతుందేమోనని మెట్లెక్కి ముందుకు వెళ్ళాడు....................
అవి వర్షారంభదినాలు. సాయంకాలమయింది. విష్ణుపురం నుంచి మంధారణానికి వెళ్ళే మార్గంలో ఒక యువకుడు గుర్రం పైన సవారీ అయి, ఒంటరిగా ప్రయాణిస్తున్నాడు. అతను వెళ్ళే ప్రాంతం ఒక అంతులేని మైదానం. త్వరలో చీకటి పడిపోతుందన్న ఉద్దేశంతో ఆ యువకుడు గుర్రాన్ని మరింత వేగంగా నడిపించాడు. అతను మైదానాన్ని దాటేసరికి సూర్యుడస్తమించి, మేఘాలు కప్పిన ఆకాశాన్ని చీకట్లు ఆవరించాయి. త్వరలోనే గుర్రానికి దారి కనిపించకుండా పోయింది. మధ్య మధ్య ఆకాశాన వచ్చే మెరుపుల కాంతిలో అతను దారి చూసుకుంటూ ముందుకుసాగాడు. మరి కొంచెం సేపటికల్లా ఉధృతంగా గాలి వీచింది. దానితోపాటు వాన కూడా సాగింది.. యువకుడు తానై గుర్రాన్ని నడపలేక, కళ్ళెం విడిచేసి, గుర్రాన్ని దాని ఇచ్ఛ ప్రకారం పోనిచ్చాడు. కొంత దూరం ఇలా పోగా గుర్రం కాలికి రాతిగట్టులాంటిదేదో తగిలింది. అంతలోనే మెరుపు మెరిసి, యువకుడికి తెల్లని కట్టడం ఏదో కనిపించింది. అతను గుర్రం దిగి చూసేసరికి, గుర్రం కాలికి తగిలినది రాతి మెట్లని తెలిసింది. అతను గుర్రాన్ని అక్కడే వదిలి, ఎక్కడన్నా ఆశ్రయం దొరుకుతుందేమోనని మెట్లెక్కి ముందుకు వెళ్ళాడు....................© 2017,www.logili.com All Rights Reserved.