అది జూన్ మాసంలోని ఓ సాయంత్రం. అప్పుడప్పుడే వేసవి గడిచి వర్షాకాలం ప్రారంభమైంది. అప్పటికే బాగా వర్షం కురిసి, చుట్టుపక్కలున్న ప్రకృతి పచ్చాపచ్చాగా మారింది. అక్కడి ఎత్తయిన మల్లయ్య కొండ కూడా అనంత దూరానికి వ్యాపించింది. ఆ కొండమీద చెట్లు - చేమలు సొగసే సొగసు. అక్కడి ఖరీదైన టేకుచెట్లు ఎత్తుగా పెరిగాయి. 'మేమేమైనా వాటికన్నా తక్కువ' అన్నట్టు లేచి నుంచున్న రవి చెట్లు పెరిగాయి. అక్కడొకటి ఇక్కడొకటి అన్నట్టు లేచి నించున్న రావిచెట్లు రాక్షసుల్లా చిన్న చిన్న మొక్కలకు శత్రువులయ్యాయి. ఏది ఏమైనా ఆ అడవిలో మొక్కలకు చెట్లకు మధ్యన పోటీ ఉందనాలి.
మల్లయ్య కొండ సమీపంలో ఒక నది ఉంది. అది కృష్ణ, కావేరిలాంటి పెద్దనది కాదు. ఆ ప్రాంతంలోని ఆ భాగానికి చెందిన నీటి తటాకం. మహా ఉంటే అయిదారు కిలోమీటర్ల పొడవుంది, సంవత్సరంలో ఎనిమిది, పదినెలలు మాత్రమే ప్రవహించే చిన్న నది.
- డా. మల్లికార్జున పాటిల