డాక్టర్ భువనేశ్వరరావు గారు తెలుగు కథల ప్రచురణ బాధ్యతలు ఉద్యమస్పూర్తితో నిర్వహిస్తున్నారు. గతంలో వీరు పదిమంది రచయితల కథలతో తెలుగు కథనం ప్రచురించి కథా సంకలనాల పైన తమదైన ముద్రవేశారు. వీరిప్పుడు ఇనుమడించిన ఉత్సాహంతో ఇరవై మంది రచయితల వంద కథలతో కథానందనం ప్రచురించారు. గతంలో లాగే వీరు రచయితల ఎంపికలో జండర్ సమానత్వాన్ని పాటించారు.
సమాజంలో సాహిత్యంలో తరాల అంతరాలు ప్రతిఫలించాలన్న ఆశయంతో లబ్దప్రతిష్టుల నుంచి వర్ధమాన రచయితల వరకు పలువురి కథలు సంకలనంలో చేర్చారు. ఎప్పటినుంచో రాస్తున్న వారు ఏనాడో సుప్రసిద్దులైనవారు వాసా ప్రభావతి గారు డాక్టర్ సోమరాజు సుశీల గారు. నిన్న మొన్న కలం పట్టిన వారు ఎండ్లూరి మానస గారు. ఆ విధంగా ఈ సంకలనం కొత్త పాతల మేలు కలయికగా విరాజిల్లుతోంది.
తెలుగు కథకు మానవ సంబంధాలే ప్రధాన వస్తువు. మరి ముఖ్యంగా కుటుంబ సంబంధాల చిత్రణలో తెలుగు రచయితలు ఎంతో ప్రతిభ కనబరిచారు. ప్రస్తుత సంకలనంలో రెండు మూడు తరాల జీవన చిత్రణ మనం చూడవచ్చు. ఒక్క తరం ముందు వాళ్లను చుసిన వాళ్ళెంతో వెలవగా బతికారనిపిస్తుంది. గొప్పగా కాకపోయినా గొప్పలకు పోకపోయినా ఎంతో పొందికగా జాగ్రత్తగా జీవనం సాగించారని బంధాలకు బాధ్యతలకు కట్టుబడ్డారని అనుబంధాలను పెంచుకున్నారని విలువలకు నిలబడ్డారని తెలుస్తుంది.
- డా. భువన్