Title | Price | |
Play | Rs.110 | In Stock |
హైదరబాద్.. బషీర్ బాగ్.. సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిముషాలైంది. చలికాలం కావడంవల్ల సన్న, సన్నని చీకట్లు ముసురుకున్నాయి. మంచుతో కలగలిపిన చల్లని చలిగాలి రివ్వు, రివ్వున వీస్తోంది. అయినా బషీర్ బాగ్ చౌరస్తా, ఎప్పటిలాగే సందడిగా ఉంది. ట్రాఫిక్ ఐలాండ్ లోని పోలీస్ కానిస్టేబుల్, స్టేజి మీద కధాకళి చేస్తున్న డాన్సర్ లా ఉన్నాడు. చౌరస్తాకు, నాలుగు వైపులా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్, హడావుడిగా తమ పని తాము చేసుకుపోతున్నాయి.
అప్పుడే రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్ గా మారింది. లిబర్టీ వైపు నుంచి ఆబిడ్స్ కు వెళ్ళే వాహనాలు సర్రుమని, ముందుకు దూసుకుపోయాయి. అదే సమయంలో కుడిపక్క, ఫుట్ పాత్ రోడ్ ని క్రాస్ చెయ్యడానికి నుంచున్నాడో వ్యక్తి. ఆయనకో అరవై ఏళ్ల వయసుంటుంది - తెల్లటి పంచె, దానిమీద తెల్లటి లాల్చీ, ఆ లాల్చీ మీద గ్రే కలర్ స్వెటర్ - కంఠం చుట్టూ మఫ్లర్ ఎడం చేతిలో ఏదో డైరీ - కుడి చేతి వేళ్ళ మధ్య వెలుగుతున్న చార్మినార్ సిగరెట్! కాళ్ళకు హవాయి చెప్పల్స్.. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
హైదరబాద్.. బషీర్ బాగ్.. సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిముషాలైంది. చలికాలం కావడంవల్ల సన్న, సన్నని చీకట్లు ముసురుకున్నాయి. మంచుతో కలగలిపిన చల్లని చలిగాలి రివ్వు, రివ్వున వీస్తోంది. అయినా బషీర్ బాగ్ చౌరస్తా, ఎప్పటిలాగే సందడిగా ఉంది. ట్రాఫిక్ ఐలాండ్ లోని పోలీస్ కానిస్టేబుల్, స్టేజి మీద కధాకళి చేస్తున్న డాన్సర్ లా ఉన్నాడు. చౌరస్తాకు, నాలుగు వైపులా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్, హడావుడిగా తమ పని తాము చేసుకుపోతున్నాయి. అప్పుడే రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్ గా మారింది. లిబర్టీ వైపు నుంచి ఆబిడ్స్ కు వెళ్ళే వాహనాలు సర్రుమని, ముందుకు దూసుకుపోయాయి. అదే సమయంలో కుడిపక్క, ఫుట్ పాత్ రోడ్ ని క్రాస్ చెయ్యడానికి నుంచున్నాడో వ్యక్తి. ఆయనకో అరవై ఏళ్ల వయసుంటుంది - తెల్లటి పంచె, దానిమీద తెల్లటి లాల్చీ, ఆ లాల్చీ మీద గ్రే కలర్ స్వెటర్ - కంఠం చుట్టూ మఫ్లర్ ఎడం చేతిలో ఏదో డైరీ - కుడి చేతి వేళ్ళ మధ్య వెలుగుతున్న చార్మినార్ సిగరెట్! కాళ్ళకు హవాయి చెప్పల్స్.. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.