'శ్రీవారి ప్రేమలేఖ' సినిమా మూల కథే ఈ పుస్తకంలోని నవల.
మధ్యాహ్నం పన్నెండున్నర అయింది. వేసవి ఎండా మండిపోతుంది. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. 'ఎందుకొచ్చిన ఖర్మరా దేవుడా!' అనుకుంటూ విధి లేక తప్పనిసరిగా తిరుగుతున్న కొంతమంది తప్ప మిగతా అందరూ ఇళ్లలోనే ఉన్నారు. కూల్ డ్రింకులు, సోడాలు, కొబ్బరి బో౦డాలకి మహా డిమాండ్ గా ఉంది. అలా౦టి సమయంలో ఆ బాధ తెలిసే అవకాసం లేని ఏ.సి.రూమ్ లో రివాల్వింగ్ చైర్ లో కూర్చుని ఏవో పేపర్లు చూస్తున్నాడు ఆనందరావు.
మెల్లిగా శబ్దం చెయ్యకుండా తలుపు తెరుచుకుంది. అతని సెక్రటరీ మార్గరెట్ హైహీల్స్ శబ్దం రాకుండా మెల్లిగా నడుచుకుంటూ వచ్చి అతని ముందున్న పెద్ద టేబుల్ మీద లెటర్స్ ఉంచింది. ఒకసారి మార్గరెట్ వంక చూసి, ఆ లెటర్స్ అన్నీ చదివి చూసుకొని టకటక సంతకాలు పెట్టి అందించాడు. అందుకొని వెళ్ళిపోయింది మార్గరెట్.
తల ఎత్తి వాల్ క్లాక్ వైపు చూశాడు. ఒంటిగంట. మెల్లిగా లేచి తలుపు తెరుచుకొని బయటికి వచ్చాడు. అలవాటు ప్రకారం మార్గరెట్ టేబుల్ దగ్గర ఆగాడు. అతన్ని చూస్తూనే లేచి నిలబడి చిరునవ్వు నవ్వి "ఇవిగోండి సార్" అని అతని పర్సనల్ లెటర్స్ అందించింది.
"థ్యాంక్యూ" అనేసి లెటర్స్ జేబులో పెట్టుకొని టకటక కిందకి వచ్చాడు. తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే ఈ నవల చదవాల్సిందే.
- పొత్తూరి విజయ లక్ష్మి
'శ్రీవారి ప్రేమలేఖ' సినిమా మూల కథే ఈ పుస్తకంలోని నవల. మధ్యాహ్నం పన్నెండున్నర అయింది. వేసవి ఎండా మండిపోతుంది. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. 'ఎందుకొచ్చిన ఖర్మరా దేవుడా!' అనుకుంటూ విధి లేక తప్పనిసరిగా తిరుగుతున్న కొంతమంది తప్ప మిగతా అందరూ ఇళ్లలోనే ఉన్నారు. కూల్ డ్రింకులు, సోడాలు, కొబ్బరి బో౦డాలకి మహా డిమాండ్ గా ఉంది. అలా౦టి సమయంలో ఆ బాధ తెలిసే అవకాసం లేని ఏ.సి.రూమ్ లో రివాల్వింగ్ చైర్ లో కూర్చుని ఏవో పేపర్లు చూస్తున్నాడు ఆనందరావు. మెల్లిగా శబ్దం చెయ్యకుండా తలుపు తెరుచుకుంది. అతని సెక్రటరీ మార్గరెట్ హైహీల్స్ శబ్దం రాకుండా మెల్లిగా నడుచుకుంటూ వచ్చి అతని ముందున్న పెద్ద టేబుల్ మీద లెటర్స్ ఉంచింది. ఒకసారి మార్గరెట్ వంక చూసి, ఆ లెటర్స్ అన్నీ చదివి చూసుకొని టకటక సంతకాలు పెట్టి అందించాడు. అందుకొని వెళ్ళిపోయింది మార్గరెట్. తల ఎత్తి వాల్ క్లాక్ వైపు చూశాడు. ఒంటిగంట. మెల్లిగా లేచి తలుపు తెరుచుకొని బయటికి వచ్చాడు. అలవాటు ప్రకారం మార్గరెట్ టేబుల్ దగ్గర ఆగాడు. అతన్ని చూస్తూనే లేచి నిలబడి చిరునవ్వు నవ్వి "ఇవిగోండి సార్" అని అతని పర్సనల్ లెటర్స్ అందించింది. "థ్యాంక్యూ" అనేసి లెటర్స్ జేబులో పెట్టుకొని టకటక కిందకి వచ్చాడు. తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే ఈ నవల చదవాల్సిందే. - పొత్తూరి విజయ లక్ష్మి© 2017,www.logili.com All Rights Reserved.