ఆఖరి లంకె
ఉద్యమాలను వ్యక్తులు నిర్మించరు అన్నది నిజమే అయినా ఆ ఉద్యమాలలో పాల్గొన్న వ్యక్తుల కార్యకలాపాలు చరిత్ర నిర్మాణంలో భాగం అవుతాయి. కందిమళ్ల ప్రతాపరెడ్డి జీవితం సుదీర్ఘ కాలం ప్రజోద్యమాలతో, యువజనోద్యమాలతో, ప్రజానాట్యమండలితో, కమ్యూనిస్టు పార్టీతో పెనవేసుకుపోయింది. ఆయనకు సంబంధం ఉన్న అంశాల చరిత్ర ఇతరత్రా అపారంగా అందుబాటులో ఉండవచ్చు.
కానీ వ్యక్తిగతంగా ఆయన అనుభవాలు కూడా చరిత్ర నిర్మాణానికి ఉపకరణాలే.
కందిమళ్ల ప్రతాపరెడ్డి అడపా దడపా రాజకీయ, సాంస్కృతిక అంశాలపై రాసిన వ్యాస సంపుటి ఈ “మరవరాని మన చరిత్ర”. కమ్యూనిస్టు పార్టీతో ప్రతాపరెడ్డికి సుదీర్ఘ కాలంగా సంబంధం ఉంది. చాలా కాలం రాష్ట్ర నాయకత్వంలో భాగస్వామి. తెలంగాణ సాయుధ పోరాటంలో చిన్న నాటే అంటే యుక్త వయసైనా రాక ముందే సంబంధం ఉన్న వారాయన. సాహిత్య రంగంలోనూ ఆయన కృషి తగినంతగా ఉంది. ప్రజానాట్య మండలి పునర్నిర్మాణం తరవాత ఆయన ఆ కార్యకలాపాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించారు. ఇలా వివిధ రంగాలలో ఆయన అనుభవాలు, జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి. ఈ అనుభవాల్లో కొన్ని ఇదివరకే గ్రంథస్థమైనాయి. మిగిలిన వ్యాసాలను కూర్చి ఈ గ్రంథం సిద్ధం చేశారు.
ఏడు దశాబ్దాల కన్నా మునుపటి చరిత్రను, ఆ తరవాత వివిధ రంగాల్లో ఆయన క్రియాశీల పాత్ర గురించి రికార్డు చేయడం ఈ దశలో అవసరం. స్వాతంత్ర్య పోరాటంతో సంబంధం ఉన్న వారి, దాన్ని ప్రత్యక్షంగా చూసిన వారి తరం క్రమంగా వెళ్లిపోతోంది. ఆ వరసలో ప్రతాప రెడ్డి లాంటివారు అతి కొద్దిమందే మిగిలి ఉండొచ్చు. సాయుధ పోరాట స్మృతులు ఆయన జ్ఞాపకాల పేటికలో ఇంకా భద్రంగానే ఉన్నాయి. ప్రత్యక్షంగా ఆ పోరాటంలో పాల్గొన్న వారిలో చాలా మంది ఆ అనుభవాలను గ్రంథస్థం చేశారు. ఆ వరసలో ప్రతాప రెడ్డి బహుశః ఆఖరి లంకె కావచ్చు........
ఆఖరి లంకె ఉద్యమాలను వ్యక్తులు నిర్మించరు అన్నది నిజమే అయినా ఆ ఉద్యమాలలో పాల్గొన్న వ్యక్తుల కార్యకలాపాలు చరిత్ర నిర్మాణంలో భాగం అవుతాయి. కందిమళ్ల ప్రతాపరెడ్డి జీవితం సుదీర్ఘ కాలం ప్రజోద్యమాలతో, యువజనోద్యమాలతో, ప్రజానాట్యమండలితో, కమ్యూనిస్టు పార్టీతో పెనవేసుకుపోయింది. ఆయనకు సంబంధం ఉన్న అంశాల చరిత్ర ఇతరత్రా అపారంగా అందుబాటులో ఉండవచ్చు. కానీ వ్యక్తిగతంగా ఆయన అనుభవాలు కూడా చరిత్ర నిర్మాణానికి ఉపకరణాలే. కందిమళ్ల ప్రతాపరెడ్డి అడపా దడపా రాజకీయ, సాంస్కృతిక అంశాలపై రాసిన వ్యాస సంపుటి ఈ “మరవరాని మన చరిత్ర”. కమ్యూనిస్టు పార్టీతో ప్రతాపరెడ్డికి సుదీర్ఘ కాలంగా సంబంధం ఉంది. చాలా కాలం రాష్ట్ర నాయకత్వంలో భాగస్వామి. తెలంగాణ సాయుధ పోరాటంలో చిన్న నాటే అంటే యుక్త వయసైనా రాక ముందే సంబంధం ఉన్న వారాయన. సాహిత్య రంగంలోనూ ఆయన కృషి తగినంతగా ఉంది. ప్రజానాట్య మండలి పునర్నిర్మాణం తరవాత ఆయన ఆ కార్యకలాపాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించారు. ఇలా వివిధ రంగాలలో ఆయన అనుభవాలు, జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి. ఈ అనుభవాల్లో కొన్ని ఇదివరకే గ్రంథస్థమైనాయి. మిగిలిన వ్యాసాలను కూర్చి ఈ గ్రంథం సిద్ధం చేశారు. ఏడు దశాబ్దాల కన్నా మునుపటి చరిత్రను, ఆ తరవాత వివిధ రంగాల్లో ఆయన క్రియాశీల పాత్ర గురించి రికార్డు చేయడం ఈ దశలో అవసరం. స్వాతంత్ర్య పోరాటంతో సంబంధం ఉన్న వారి, దాన్ని ప్రత్యక్షంగా చూసిన వారి తరం క్రమంగా వెళ్లిపోతోంది. ఆ వరసలో ప్రతాప రెడ్డి లాంటివారు అతి కొద్దిమందే మిగిలి ఉండొచ్చు. సాయుధ పోరాట స్మృతులు ఆయన జ్ఞాపకాల పేటికలో ఇంకా భద్రంగానే ఉన్నాయి. ప్రత్యక్షంగా ఆ పోరాటంలో పాల్గొన్న వారిలో చాలా మంది ఆ అనుభవాలను గ్రంథస్థం చేశారు. ఆ వరసలో ప్రతాప రెడ్డి బహుశః ఆఖరి లంకె కావచ్చు........© 2017,www.logili.com All Rights Reserved.