డా. పోరంకి దక్షిణామూర్తి తూర్పు గోదావరి జిల్లా ఆలమూరులో 24 డిశంబరు, 1935న జన్మించారు. వివిధ ఉద్యగాలు చేశారు. తెలుగు అకాడమి ఉపసంచాలకుడిగా 1993 లో పదవీ విరమణ చేశారు. 'వెలుగూ వెన్నెలా గోదారీ', 'ముత్యాల పందిరి', 'రంగవల్లి' అన్న నవలలను తీరాంధ్ర, తెలంగాణా, రాయలసీమ మాండలికాలలో రచించి మూడు మాండలికాలలోనూ తొలి నవలలు రచించిన కీర్తి సంపాదించారు. మరెన్నో నవలలు, కథలు, పరిశోధన వ్యాసాలూ రచించారు. అనేక అనువాదాలు చేశారు. తెలుగు కథానిక - స్వరూప స్వభావాలపై ప్రామాణికమైన సిద్ధాంత వ్యాసం రచించి డాక్టరేట్ పట్టా పొందారు.
"కమలా! నా ముంగిట్లో తీర్చిన ముత్యాలముగ్గువే నువ్వు!" అని మురిసిపోయాడు రంగయ్య. "కసవుతో నిండింది దేశం. దాన్ని ఊడ్చాలి. కళ్ళాపి జల్లాలి..." అని అడవులు వట్టినది కమల. తాను పెంచిన బిడ్డ పితూరీదారల్లో చేరిపోవడం క్షమించలేకపోయినా, తిరిగి ఆమె బిడ్డని పెంచడానికి తెచ్చుకున్న నికార్సయిన మనిషి రంగయ్య జీవితేతిహాసం 'రంగవల్లి'. గ్రామస్థుల ముద్దుముచ్చట్లు, పంతాలు పట్టుదలలు కౌటిల్యాలు క్రౌర్యాలు, ఆశలు నిరాశలు, దయాదాక్షిణ్యాలు అద్వితీయంగా చిత్రించే నవల.
డా. పోరంకి దక్షిణామూర్తి తూర్పు గోదావరి జిల్లా ఆలమూరులో 24 డిశంబరు, 1935న జన్మించారు. వివిధ ఉద్యగాలు చేశారు. తెలుగు అకాడమి ఉపసంచాలకుడిగా 1993 లో పదవీ విరమణ చేశారు. 'వెలుగూ వెన్నెలా గోదారీ', 'ముత్యాల పందిరి', 'రంగవల్లి' అన్న నవలలను తీరాంధ్ర, తెలంగాణా, రాయలసీమ మాండలికాలలో రచించి మూడు మాండలికాలలోనూ తొలి నవలలు రచించిన కీర్తి సంపాదించారు. మరెన్నో నవలలు, కథలు, పరిశోధన వ్యాసాలూ రచించారు. అనేక అనువాదాలు చేశారు. తెలుగు కథానిక - స్వరూప స్వభావాలపై ప్రామాణికమైన సిద్ధాంత వ్యాసం రచించి డాక్టరేట్ పట్టా పొందారు. "కమలా! నా ముంగిట్లో తీర్చిన ముత్యాలముగ్గువే నువ్వు!" అని మురిసిపోయాడు రంగయ్య. "కసవుతో నిండింది దేశం. దాన్ని ఊడ్చాలి. కళ్ళాపి జల్లాలి..." అని అడవులు వట్టినది కమల. తాను పెంచిన బిడ్డ పితూరీదారల్లో చేరిపోవడం క్షమించలేకపోయినా, తిరిగి ఆమె బిడ్డని పెంచడానికి తెచ్చుకున్న నికార్సయిన మనిషి రంగయ్య జీవితేతిహాసం 'రంగవల్లి'. గ్రామస్థుల ముద్దుముచ్చట్లు, పంతాలు పట్టుదలలు కౌటిల్యాలు క్రౌర్యాలు, ఆశలు నిరాశలు, దయాదాక్షిణ్యాలు అద్వితీయంగా చిత్రించే నవల.
© 2017,www.logili.com All Rights Reserved.