సశేషం పూర్తిగా పూర్వజన్మల అనుబంధాలకూ, జన్మజన్మల బంధాలకూ అద్దంపట్టే రచన కనుక, నా ముందు మాటలలో - కొందరైనా, పరమాత్మ సంబంధీకుల గురించి రేఖా మాత్రంగానైనా వ్రాయాలన్పించి వ్రాస్తున్నాను. నా సుదీర్ఘ జీవనయానంలో ఎందరో మరెందరో ఇంకెందరో స్మరించుకోవలసినవారున్నారు. అపురూపంగా ఏ కొద్దిమందిలోనో పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. ఆ స్మృతుల వెంట పరుగులు తీస్తూ, ఆ అనుబంధాలకు చేరువ కావాలన్న తపనతో, ఈ జన్మకు సంబంధించిన బాంధవ్య బందితులను నిర్లక్ష్యం చెయ్యటం, మానసికంగా బాధించటం, తద్వారా మనోవేదనకు గురికావటం, వంచనీయం కాదు. ఎంతో ఉదాత్తంగా మల్చుకోవలసిన మానవ జన్మను, అర్ధరహితమైన మనస్థాపాలతో వ్యర్ధపరచుకోవటం క్షంతవ్యం కాదు.
గతజన్మ సంబంధీకులు ఈ జన్మలోనూ, ఈ జన్మలోని బాంధవ్యాలు వచ్చే జన్మలోనూ, అలా జన్మజన్మలుగా సాగిపోతూనే ఉంటాయి. ఈ భావబంధాలు కొనసాగిపోతూనే వుంటాయి. అందుకే - అందరూ మనవాళ్ళే, అందరూ ఆత్మీయులే - అందరూ ఆత్మాబంధువులే - అందరం పరమాత్మ బంధువులమే. ఈ అవగాహనతోనే ముందుకు సాగిపోతూ - విశ్వప్రేమ తత్త్వానికి ప్రతీకగా నిలవాలన్నదే 'సశేషం' సందేశం.
సశేషం పూర్తిగా పూర్వజన్మల అనుబంధాలకూ, జన్మజన్మల బంధాలకూ అద్దంపట్టే రచన కనుక, నా ముందు మాటలలో - కొందరైనా, పరమాత్మ సంబంధీకుల గురించి రేఖా మాత్రంగానైనా వ్రాయాలన్పించి వ్రాస్తున్నాను. నా సుదీర్ఘ జీవనయానంలో ఎందరో మరెందరో ఇంకెందరో స్మరించుకోవలసినవారున్నారు. అపురూపంగా ఏ కొద్దిమందిలోనో పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. ఆ స్మృతుల వెంట పరుగులు తీస్తూ, ఆ అనుబంధాలకు చేరువ కావాలన్న తపనతో, ఈ జన్మకు సంబంధించిన బాంధవ్య బందితులను నిర్లక్ష్యం చెయ్యటం, మానసికంగా బాధించటం, తద్వారా మనోవేదనకు గురికావటం, వంచనీయం కాదు. ఎంతో ఉదాత్తంగా మల్చుకోవలసిన మానవ జన్మను, అర్ధరహితమైన మనస్థాపాలతో వ్యర్ధపరచుకోవటం క్షంతవ్యం కాదు. గతజన్మ సంబంధీకులు ఈ జన్మలోనూ, ఈ జన్మలోని బాంధవ్యాలు వచ్చే జన్మలోనూ, అలా జన్మజన్మలుగా సాగిపోతూనే ఉంటాయి. ఈ భావబంధాలు కొనసాగిపోతూనే వుంటాయి. అందుకే - అందరూ మనవాళ్ళే, అందరూ ఆత్మీయులే - అందరూ ఆత్మాబంధువులే - అందరం పరమాత్మ బంధువులమే. ఈ అవగాహనతోనే ముందుకు సాగిపోతూ - విశ్వప్రేమ తత్త్వానికి ప్రతీకగా నిలవాలన్నదే 'సశేషం' సందేశం.© 2017,www.logili.com All Rights Reserved.