ఎక్కడో కళింగలో పుట్టి పెరిగిన గజపతుల వంశంలో మేటి అయిన మహారాజు ప్రతాపరుద్రగజపతి, మహారాణి లక్ష్మీదేవి, వీరి కుమార్తె చిన్నాదేవి, నరహరిపాత్రుడు, వీరభద్ర దేవుల చుట్టూ తిరిగిన కథ, అనుకోకుండా మలుపు తిరిగి మూరురాయగండ, అష్టదిక్కు, రాయమనోభయంకర, గజపతిదళ విభాళ, శ్రీ వీరప్రతాప, విజయనగరాధీశ్వర శ్రీకృష్ణదేవరాయల చుట్టూ తిరిగి, నరహరిపాత్రునికి దక్కాల్సిన చిన్నాదేవి, కృష్ణరాయని వరించాల్సి వచ్చిన నేపథ్యాన్ని, ఎంతో నాటకీయంగా వర్ణించారు. కటకం, హింపీ, విజయనగరం, ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి నగరాలు, బీదరు, బీజాపూరు దుర్గాల మధ్య జరిగిన చారిత్రిక సంఘటనలను, సన్నివేశాలను మనముందుంచటానికి సుబ్బరామయ్య గారు ఒక చక్కటి కథనాన్ని నడిపించటంలో చేయి తిరిగిన చరిత్రకారుని కంటే మిన్నగా తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఆనాటి చరిత్ర, ఈనాడు జరుగుతుందా అన్నంత వాస్తవికతకు అద్దంపడుతున్న ఈ నవలను తెలుగుపాఠక లోకం ఆదరించి, అక్కున జేర్చుకుంటుందని ఆశిస్తూ....
- ఈమని శివనాగిరెడ్డి
ఎక్కడో కళింగలో పుట్టి పెరిగిన గజపతుల వంశంలో మేటి అయిన మహారాజు ప్రతాపరుద్రగజపతి, మహారాణి లక్ష్మీదేవి, వీరి కుమార్తె చిన్నాదేవి, నరహరిపాత్రుడు, వీరభద్ర దేవుల చుట్టూ తిరిగిన కథ, అనుకోకుండా మలుపు తిరిగి మూరురాయగండ, అష్టదిక్కు, రాయమనోభయంకర, గజపతిదళ విభాళ, శ్రీ వీరప్రతాప, విజయనగరాధీశ్వర శ్రీకృష్ణదేవరాయల చుట్టూ తిరిగి, నరహరిపాత్రునికి దక్కాల్సిన చిన్నాదేవి, కృష్ణరాయని వరించాల్సి వచ్చిన నేపథ్యాన్ని, ఎంతో నాటకీయంగా వర్ణించారు. కటకం, హింపీ, విజయనగరం, ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి నగరాలు, బీదరు, బీజాపూరు దుర్గాల మధ్య జరిగిన చారిత్రిక సంఘటనలను, సన్నివేశాలను మనముందుంచటానికి సుబ్బరామయ్య గారు ఒక చక్కటి కథనాన్ని నడిపించటంలో చేయి తిరిగిన చరిత్రకారుని కంటే మిన్నగా తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఆనాటి చరిత్ర, ఈనాడు జరుగుతుందా అన్నంత వాస్తవికతకు అద్దంపడుతున్న ఈ నవలను తెలుగుపాఠక లోకం ఆదరించి, అక్కున జేర్చుకుంటుందని ఆశిస్తూ.... - ఈమని శివనాగిరెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.