కస్టమ్స్ అధికారులు ప్రతి ఒక్కర్ని లగేజీతో పాటు చెక్ చేసి పంపించేస్తున్నారు. వెయిటింగ్ లో ఉన్న ప్రయాణీకుల్లో హరి శంకరశాస్త్రి అనే ఆయనున్నారు. జరీ అంచు ఎర్రటి శిల్కు పంచె.. గోధుమ రంగు పొత్తూరు శిల్కు జుబ్బా ధరించారు. నుదుట విభూది రేఖల మధ్య ఉదయించే సూర్యుడిలా ఎర్రటి కుంకుమ బొట్టు. ముఖంలో ఎదో తెలీని పవిత్రత, స్వచ్చత, గాంభీర్యం, ఆత్మవిశ్వాసం.. తను నమ్మిన శాస్త్రం మీద పట్టు ఉన్న ఠీవి. ఇతరుల పట్ల దయ, కరుణ ప్రేమ కనబరిచే చూపులు. ఒక చేతికి బంగారు వాచీ. రెండో చేతికి పసిడి మురుగు. మెడలో బంగారు రుద్రాక్షమాల. పాదాలకు ఆకుచెప్పులు ధరించి విశిష్టంగా కనబడుతున్నారు. భుజాన జరీ అంచు ఉత్తరీయం ఉంది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
కస్టమ్స్ అధికారులు ప్రతి ఒక్కర్ని లగేజీతో పాటు చెక్ చేసి పంపించేస్తున్నారు. వెయిటింగ్ లో ఉన్న ప్రయాణీకుల్లో హరి శంకరశాస్త్రి అనే ఆయనున్నారు. జరీ అంచు ఎర్రటి శిల్కు పంచె.. గోధుమ రంగు పొత్తూరు శిల్కు జుబ్బా ధరించారు. నుదుట విభూది రేఖల మధ్య ఉదయించే సూర్యుడిలా ఎర్రటి కుంకుమ బొట్టు. ముఖంలో ఎదో తెలీని పవిత్రత, స్వచ్చత, గాంభీర్యం, ఆత్మవిశ్వాసం.. తను నమ్మిన శాస్త్రం మీద పట్టు ఉన్న ఠీవి. ఇతరుల పట్ల దయ, కరుణ ప్రేమ కనబరిచే చూపులు. ఒక చేతికి బంగారు వాచీ. రెండో చేతికి పసిడి మురుగు. మెడలో బంగారు రుద్రాక్షమాల. పాదాలకు ఆకుచెప్పులు ధరించి విశిష్టంగా కనబడుతున్నారు. భుజాన జరీ అంచు ఉత్తరీయం ఉంది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.