వాళ్ళు నలుగురు! కాలేజీ రోజులనుంచీ వున్న ప్రాణస్నేహం ఆ నలుగుర్నీ ఆ తర్వాత కూడా సన్నిహితంగా బంధించి ఉంచింది. ఒకరికి చిత్రలేఖనంలో అభినివేశం! మరొకరికి సంగీతం పై అభిరుచి! ఇంకొకరికి పుస్తక పఠనాభిలాష! ఆ ముగ్గురి ఇష్టాలపై రెట్టింపు ఇష్టాన్ని పెంచుకుంది నాల్గవ నేస్తం! ఆ ప్రభావంతో... "స్నేహం, ప్రేమ నాజీవితాశయం" అని చెప్పుకున్న సహజకి ఆ తర్వాత ఎదురయిన అనుభవాలేమిటి? చివరికి ఆమె - "చిన్నప్పటి నుంచీ మీరే - పాటలు పాడీ, బొమ్మలు వేసీ, దొరికిన పుస్తకమల్లా నాచేత చదివించీ, నాకీ పిచ్చి ఎక్కించారు. ఇపుడు మీరు హాయిగా సంసారాలు చేసుకుంటుంటే నేనింకా ఈ పిచ్చిలోనే పడి కొట్టుకుంటున్నాను" అని ఎందుకు అనవలసి వచ్చింది. ఆమె అలా తన స్నేహితురాళ్ళపై మోపిన ఆ అభియోగంలోని వాస్తవం ఏమిటి? మన పురుషాధిక్య సమాజంలో వివాహానంతరం స్త్రీ జీవితం చెందే పరిణామాల్ని, భిన్నస్వభావాలు గల భర్తలకనుగుణంగా భార్యలు అవలంభిస్తున్న రాజీ మార్గాలని ఆలోచనలు రేకెత్తించే విధంగా చిత్రించిన ఓల్గా రచన "సహజ".
వాళ్ళు నలుగురు! కాలేజీ రోజులనుంచీ వున్న ప్రాణస్నేహం ఆ నలుగుర్నీ ఆ తర్వాత కూడా సన్నిహితంగా బంధించి ఉంచింది. ఒకరికి చిత్రలేఖనంలో అభినివేశం! మరొకరికి సంగీతం పై అభిరుచి! ఇంకొకరికి పుస్తక పఠనాభిలాష! ఆ ముగ్గురి ఇష్టాలపై రెట్టింపు ఇష్టాన్ని పెంచుకుంది నాల్గవ నేస్తం! ఆ ప్రభావంతో... "స్నేహం, ప్రేమ నాజీవితాశయం" అని చెప్పుకున్న సహజకి ఆ తర్వాత ఎదురయిన అనుభవాలేమిటి? చివరికి ఆమె - "చిన్నప్పటి నుంచీ మీరే - పాటలు పాడీ, బొమ్మలు వేసీ, దొరికిన పుస్తకమల్లా నాచేత చదివించీ, నాకీ పిచ్చి ఎక్కించారు. ఇపుడు మీరు హాయిగా సంసారాలు చేసుకుంటుంటే నేనింకా ఈ పిచ్చిలోనే పడి కొట్టుకుంటున్నాను" అని ఎందుకు అనవలసి వచ్చింది. ఆమె అలా తన స్నేహితురాళ్ళపై మోపిన ఆ అభియోగంలోని వాస్తవం ఏమిటి? మన పురుషాధిక్య సమాజంలో వివాహానంతరం స్త్రీ జీవితం చెందే పరిణామాల్ని, భిన్నస్వభావాలు గల భర్తలకనుగుణంగా భార్యలు అవలంభిస్తున్న రాజీ మార్గాలని ఆలోచనలు రేకెత్తించే విధంగా చిత్రించిన ఓల్గా రచన "సహజ".© 2017,www.logili.com All Rights Reserved.