అక్కినేని కుటుంబరావు నవలలు రాజ్యాంగ నైతికతను ఇముడ్చుకున్న రచనలు. కుల వివక్షను, లైంగిక వివక్షను వాటి క్రూరమైన రూపాలలో చూపిన నవలలు. ప్రజల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన పురాతన సాంఘిక నైతికత పేరు మీద అడ్డులేకుండా జరిగే తీరుకి అడ్డం పట్టిన నవలలు. వివక్షకు వ్యతిరేకంగా సమానత్వాన్ని కోరే సంస్కారాన్ని పాఠకులకు అందించే నవలలివి. 'జీవించే హక్కు' ని అన్ని నవలలోనూ రచయిత పలు కోణాలలో ఎత్తి చూపించాడు.
ప్రజల భాషలో, సహజ అలంకార శైలిలో, ఒక సచిత్ర సంభాషణ ద్వారా రాజ్యాంగ నైతికత చర్చను నవలలన్నిటిలో నిగూడంగా నడిపించాడు. ఆ చర్చ మనకు కలిగించే జ్ఞానాన్ని నవలలనుంచి విడదీయలేనంతగా పెనవేయటం కుటుంబరావుకి రచయితగా ఒక ప్రత్యేకత నిచ్చింది. ఆయన స్వాతంత్ర్యానంతర భారతదేశం గురించి ఒక చారిత్రిక భావనను అందించాడు. అది మనం తేలికగా గుర్తుపట్టగలిగిన సమీప వాస్తవ సంఘటనల చరిత్రే.
అక్కినేని కుటుంబరావు నవలలు రాజ్యాంగ నైతికతను ఇముడ్చుకున్న రచనలు. కుల వివక్షను, లైంగిక వివక్షను వాటి క్రూరమైన రూపాలలో చూపిన నవలలు. ప్రజల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన పురాతన సాంఘిక నైతికత పేరు మీద అడ్డులేకుండా జరిగే తీరుకి అడ్డం పట్టిన నవలలు. వివక్షకు వ్యతిరేకంగా సమానత్వాన్ని కోరే సంస్కారాన్ని పాఠకులకు అందించే నవలలివి. 'జీవించే హక్కు' ని అన్ని నవలలోనూ రచయిత పలు కోణాలలో ఎత్తి చూపించాడు. ప్రజల భాషలో, సహజ అలంకార శైలిలో, ఒక సచిత్ర సంభాషణ ద్వారా రాజ్యాంగ నైతికత చర్చను నవలలన్నిటిలో నిగూడంగా నడిపించాడు. ఆ చర్చ మనకు కలిగించే జ్ఞానాన్ని నవలలనుంచి విడదీయలేనంతగా పెనవేయటం కుటుంబరావుకి రచయితగా ఒక ప్రత్యేకత నిచ్చింది. ఆయన స్వాతంత్ర్యానంతర భారతదేశం గురించి ఒక చారిత్రిక భావనను అందించాడు. అది మనం తేలికగా గుర్తుపట్టగలిగిన సమీప వాస్తవ సంఘటనల చరిత్రే.© 2017,www.logili.com All Rights Reserved.