" డబ్బుల విషయానికి వస్తే, అందరి మతమూ ఒకటే"
ఇది వ్యాపారవేత్తలు అరవింద్, అర్బాజ్ ల కథ. వాళ్ళిద్దరి జీవితాలు అనూహ్యంగా కలిసిపోవడం. ఒకరిపై ఒకరు ఎన్నో దారుణమైన వ్యక్తిగత, వృత్తిగత కుట్రలు, కుతంత్రాలు చేయడం, అన్ని నియమనిబంధనలనూ తుంగలో తొక్కడం వర్ణించే కథ. తామిద్దరూ దేనికోసమైతే అన్వేషిస్తున్నారో, పోట్లాడుకుంటున్నారో అదే చరిత్రలో కనుమరుగైపోయిన ఒక గొప్ప రహస్యాన్ని కనుగొనడానికి అవాంతరంగా మారిందని వాళ్లెరుగరు.
అయితే, వీటన్నిటి వెనుక, అంతరాంతరాల్లో ప్రేమ ఉంది, విషాదం ఉంది. రక్తం ఉంది. అతి కొద్ది క్షణాల అనంతమైన ఆనందం ఉంది. ఒకే వ్యక్తి పాపి, యోగి కూడా కావచ్చునా? విజేత, బాధితుడు కావచ్చునా. నలుపు, తెలుపు కావచ్చునా?
కథాకథనంలో అత్యంత నిపుణుడు అశ్విన్ సాంఘి మరోసారి గతం, వర్తమానం, వాస్తవం, కల్పనా, చరిత్ర, పురాణం, వ్యాపారం, రాజకీయం, ప్రేమ, ద్వేషం, కలగలిపి, అనేక పొరల గాథను ఉత్కంఠభరితంగా అల్లి, అనూహ్యమైన ముగింపుతో మీ ముందుంచారు. ఇది చదివాక, ఇంతకూ మనకు ఏది ముఖ్యం. విశ్వాసమా, విధా అన్న ప్రశ్న మనలో నిలిచిపోతుంది.
" డబ్బుల విషయానికి వస్తే, అందరి మతమూ ఒకటే" ఇది వ్యాపారవేత్తలు అరవింద్, అర్బాజ్ ల కథ. వాళ్ళిద్దరి జీవితాలు అనూహ్యంగా కలిసిపోవడం. ఒకరిపై ఒకరు ఎన్నో దారుణమైన వ్యక్తిగత, వృత్తిగత కుట్రలు, కుతంత్రాలు చేయడం, అన్ని నియమనిబంధనలనూ తుంగలో తొక్కడం వర్ణించే కథ. తామిద్దరూ దేనికోసమైతే అన్వేషిస్తున్నారో, పోట్లాడుకుంటున్నారో అదే చరిత్రలో కనుమరుగైపోయిన ఒక గొప్ప రహస్యాన్ని కనుగొనడానికి అవాంతరంగా మారిందని వాళ్లెరుగరు. అయితే, వీటన్నిటి వెనుక, అంతరాంతరాల్లో ప్రేమ ఉంది, విషాదం ఉంది. రక్తం ఉంది. అతి కొద్ది క్షణాల అనంతమైన ఆనందం ఉంది. ఒకే వ్యక్తి పాపి, యోగి కూడా కావచ్చునా? విజేత, బాధితుడు కావచ్చునా. నలుపు, తెలుపు కావచ్చునా? కథాకథనంలో అత్యంత నిపుణుడు అశ్విన్ సాంఘి మరోసారి గతం, వర్తమానం, వాస్తవం, కల్పనా, చరిత్ర, పురాణం, వ్యాపారం, రాజకీయం, ప్రేమ, ద్వేషం, కలగలిపి, అనేక పొరల గాథను ఉత్కంఠభరితంగా అల్లి, అనూహ్యమైన ముగింపుతో మీ ముందుంచారు. ఇది చదివాక, ఇంతకూ మనకు ఏది ముఖ్యం. విశ్వాసమా, విధా అన్న ప్రశ్న మనలో నిలిచిపోతుంది.© 2017,www.logili.com All Rights Reserved.