స్త్రీల అణచివేత వెనక వున్న జండర్ విభజన శారీరక, మానసిక, చారిత్రక, సాంస్కృతిక కారణాలతో సహా ఎత్తి చూపించడంలో కూడా ఓల్గా ప్రధాన భూమిక నిర్వహించారు. స్త్రీలు కేవలం స్త్రీ విద్య, పౌరహక్కులు లాంటి అంశాల సాధనతో సరిపుచ్చుకోకుండా లింగ వివక్షతను (Sexual discrimination) గురించి అందరూ తీవ్రంగా ఆలోచించేట్లు చేయటంలో కూడా ఓల్గా ప్రముఖ పాత్ర నిర్వహించారు. తెలుగు సమాజంలో స్త్రీవాదం ఉదారవాదం నుంచి సోషలిస్ట్ స్త్రీవాదం, రాడికల్ స్త్రీవాదం దాకా పయనించడానికి ఆమె దోహదం చేశారు. స్త్రీలు అన్ని రంగాలనుంచీ దూరం చేయబడుతున్న తీరును ఆమె పసిగట్టి విశ్లేషించారు. ముఖ్యంగా స్త్రీల అణచివేత వెనక వున్న రాజకీయాలను బహిర్గతం చేశారు. ఆ రాజకీయాలకు పురుష స్వామ్యానికి వున్న సంబంధాన్ని కూడా ఆమె శక్తివంతంగా విశ్లేషించారు.తెలుగు సమాజంలో స్త్రీ సమానత్వాన్ని గురించి మాట్లాడిన చలం, కొ. కులాంటి రచయితల రచనలను విశ్లేషించటంలో కూడా ఆమె స్త్రీవాద వైఖరిని ప్రదర్శించారు.
- డా. కె. శ్రీదేవి