తుషార స్నాత ప్రభాత స్వప్నంలో ఆమె బంగారు ఇసుక తిన్నెల పై పవళించి ఉంది. తెల్లవారటానికి ముందు ఉండే నాలుగు ఘడియల కాలం క్రమంగా కరిగిపోతోంది. ఆమె అరమూసిన ఆల్చిప్పల్లాంటి అందమైన కనురెప్పల వెనుక కమనీయ దృశ్యాలు అల్లనల్లన కదలాడుతున్నాయి. ఆమె లేలేత లావణ్యం పై ప్రభాత సూర్యుని నీరెండ కిరణాలు తళుక్కున తాకి వక్రీభవిస్తున్నాయి. అతను కెమెరాలోంచి చూస్తూ ఆమెను ఫ్రేంలోకి తీసుకున్నాడు. క్రమంగా తూరుపు పొద్దున్న సిందూరపు అంచు పైపైకి వస్తోంది. ఓ సన్ని కిరణం కొబ్బరి ఆకుల మధ్య నుంచి వచ్చి ఆమె సన్ననినడుము వంపులో తాకి అదృశ్యమైపోయింది చటుక్కున. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
తుషార స్నాత ప్రభాత స్వప్నంలో ఆమె బంగారు ఇసుక తిన్నెల పై పవళించి ఉంది. తెల్లవారటానికి ముందు ఉండే నాలుగు ఘడియల కాలం క్రమంగా కరిగిపోతోంది. ఆమె అరమూసిన ఆల్చిప్పల్లాంటి అందమైన కనురెప్పల వెనుక కమనీయ దృశ్యాలు అల్లనల్లన కదలాడుతున్నాయి. ఆమె లేలేత లావణ్యం పై ప్రభాత సూర్యుని నీరెండ కిరణాలు తళుక్కున తాకి వక్రీభవిస్తున్నాయి. అతను కెమెరాలోంచి చూస్తూ ఆమెను ఫ్రేంలోకి తీసుకున్నాడు. క్రమంగా తూరుపు పొద్దున్న సిందూరపు అంచు పైపైకి వస్తోంది. ఓ సన్ని కిరణం కొబ్బరి ఆకుల మధ్య నుంచి వచ్చి ఆమె సన్ననినడుము వంపులో తాకి అదృశ్యమైపోయింది చటుక్కున. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.