చాల సంవత్సరాల క్రిందట ఆకాశవాణి, విజయవాడ కేంద్రం వారు గురజాడ స్త్రీపాత్రలను గురించి ప్రసగించమంటే ప్రసంగించాను. శ్రోతలనుంచి ప్రశంసిస్తూ చాల ఉత్తరాలు వచ్చినా యట. మూడునెలల కొకటి చొప్పున ఇంకా కొన్ని స్త్రీపాత్రలను గురించి ప్రసంగించమన్నారు. వాటికీ వచ్చిన ప్రతిస్పందన నాకు తెలిసింది. శ్రోతలకు అంతగా నచ్చటానికి గల కారణం కూడా అర్ధమైంది. అదేమిటంటే అంతకుపూర్వపు స్త్రీరచనలకంటే ఇప్పుడు రాసినవి కొంత భిన్నంగా ఉండటమే. నేను వీటిని స్త్త్రీలకోణం నుంచి ఆలోచిస్తూ రాయటమే. ఈవిధమైన ఆలోచన రావటానికి కారకులు మానాన్న తమ్మారెడ్డి సూర్యనారాయణగారు. అయన నాతో చదివించిన పుస్తకాలు . ఆ పుస్తకాలను చదవటంవలన నాకు మార్క్సిజం గురించి కుటుంబ వ్యవస్ధగురించి అవగాహన ఏర్పడింది. అయినాగానీ, నా సిద్ధాంత వ్యాసంలో నేనా స్త్రీపాత్రలను గురించి రాసినప్పుడు నా ఈ ఆలోచనతో రాయలేదు. ఎందుకంటే దాని పరిధి దానికి ఉంటుంది గాబట్టి. సిద్ధాంత వ్యాసరచనలోని నియమాలను పాటించాలి గాబట్టి. తరువాత నేను రాసిన విమర్శనాత్మక వ్యాసాలలో నేను ఆ పరిధిని పాటించలేదు. నా అవగాహన ప్రకారం రాశాను.