ఒక పదార్ధము యొక్క స్వభావమును తెల్పునది దాని ధర్మమగును వేరువేరు పదార్ధములకు వేరువేరు ధర్మములుండును. ఒక పదార్థమును చూచిన తరువాత దాని ధర్మమును తెలుసుకోవచ్చును. ఒకమారు ఒక పదార్ధముకున్న ధర్మమును తెలిసిన తర్వాత దాని ధర్మమును గుర్తు పెట్టుకొని, ఎంతకాలము తర్వాతనైనా దాని ధర్మము ప్రకారాము ఆ పదార్థమును గుర్తుపట్టవచ్చును. ఒకమారు ఒక వస్తువు ధర్మము తెలియనిదే, తర్వాత ఆ వస్తువును గుర్తుపెట్టేదానికి వీలుండదు. ఒక పదార్దాములో శాశ్వితముగా మారకుండా వుండు స్వభావమును ధర్మము అంటాము. ఒక వస్తువు లేక పదార్ధములో శాసనముగా శాశ్వితముగా ఉండు స్వభావము ధర్మము అయినపుడు, అటువంటి ధర్మము శాస్త్రబద్ధమైనదని కూడా చెప్పవచ్చును.