భూస్వామ్య సంస్కృతి తెచ్చిపెట్టిన విలువలు, పెట్టుబడీదారీ విధానంలో పుట్టుకొచ్చిన క్షీణ విలువలు కలిసి నేటి సమాజంలో నేర ప్రవృత్తిని పెంచాయి. ఇవి కుల - మతతత్వాలతో కలగాపులగమై పాలక వర్గాల రాజకీయ - ఎన్నికల ప్రయోజనాల్ని నెరవేర్చడానికి ఉపయోగపడుతున్నాయి. స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో నెలకొన్న ఈ పరిణామాలే నేడు మతతత్వ శక్తులకు లాభదాయకంగా తయారయ్యాయి. వ్యవస్థలోని సంక్షోభం - ఫలితంగా ప్రజలలో ఏర్పడిన అసంతృప్తి పెరుగుతున్నది. మధ్యతరగతి ప్రజల్లో పెరిగిపోతున్న అసంతృప్తిని మనం చూస్తూనే ఉన్నాం. గతంలో దోపిడీకి గురై ఆ తరువాత పై తరగతికి నిచ్చెన ఎక్కినవారు కాదు ఈ మధ్య తరగతి వర్గం. దోపిడీకి గురైనవారి తాజా రూపమే వీరు. నిన్నటి రోజుల్లో దోపిడీకి గురైన వారు, ప్రస్తుత మధ్యతరగతి వర్గం వారి అసంతృప్తి, తత్కారణంగా రూపొందిన మనః స్థితి కలగలిసి ఇప్పుడు మతతత్వ శక్తులకు ఊతంగా తయారయ్యింది. జన బాహుళ్యంలోని ఈ అసంతృప్తిని వాడుకొని తమ రాజకీయ ప్రయోజనాల్ని సాధించుకోవాలని మతతత్వ శక్తులు నేడు చూస్తున్నాయి.
భూస్వామ్య సంస్కృతి తెచ్చిపెట్టిన విలువలు, పెట్టుబడీదారీ విధానంలో పుట్టుకొచ్చిన క్షీణ విలువలు కలిసి నేటి సమాజంలో నేర ప్రవృత్తిని పెంచాయి. ఇవి కుల - మతతత్వాలతో కలగాపులగమై పాలక వర్గాల రాజకీయ - ఎన్నికల ప్రయోజనాల్ని నెరవేర్చడానికి ఉపయోగపడుతున్నాయి. స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో నెలకొన్న ఈ పరిణామాలే నేడు మతతత్వ శక్తులకు లాభదాయకంగా తయారయ్యాయి. వ్యవస్థలోని సంక్షోభం - ఫలితంగా ప్రజలలో ఏర్పడిన అసంతృప్తి పెరుగుతున్నది. మధ్యతరగతి ప్రజల్లో పెరిగిపోతున్న అసంతృప్తిని మనం చూస్తూనే ఉన్నాం. గతంలో దోపిడీకి గురై ఆ తరువాత పై తరగతికి నిచ్చెన ఎక్కినవారు కాదు ఈ మధ్య తరగతి వర్గం. దోపిడీకి గురైనవారి తాజా రూపమే వీరు. నిన్నటి రోజుల్లో దోపిడీకి గురైన వారు, ప్రస్తుత మధ్యతరగతి వర్గం వారి అసంతృప్తి, తత్కారణంగా రూపొందిన మనః స్థితి కలగలిసి ఇప్పుడు మతతత్వ శక్తులకు ఊతంగా తయారయ్యింది. జన బాహుళ్యంలోని ఈ అసంతృప్తిని వాడుకొని తమ రాజకీయ ప్రయోజనాల్ని సాధించుకోవాలని మతతత్వ శక్తులు నేడు చూస్తున్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.