వామకేశ్వరీమతమ్
ఆంధ్రవ్యాఖ్యాసహితమ్
ప్రథమః పటలః
శ్లో|| గణేశగ్రహనక్షత్రయోగినీరాశిరూపిణీమ్ |
దేవీం మస్త్రమయీం నౌమి మాతృకాం పీఠరూపిణీమ్ ||
ప్ర : గణేశ = గణేశులు, గ్రహ = గ్రహములు, నక్షత్ర = నక్షత్రములు, యోగినీ = యోగినులు, రాశి = రాశులు, వీని, రూపిణీమ్ = రూపములుగల, మన్తమయీమ్ = మంత్రమయియైన, పీఠరూపిణీమ్ = పీఠరూపములుగల, మాతృకాం దేవీమ్ = జగన్మాతయైన దేవిని, నౌమి = నమస్కరించుచున్నాను.
ఇది మొదలు శ్లో. 12 వరకున్ను సర్వసిద్ధికృత స్తోత్రంగా పరిగణింపబడుతున్నవి. తా : గణేశులు, గ్రహములు, నక్షత్రములు, యోగినులు, రాశులు, అను స్థూలరూపము గలిగి, వివిధ పీఠముల రూపములతో నానాదేశసంస్థితయై, అక్షరవ్యవస్థారూపమున సాక్షాత్కరించు శక్తిస్వరూపిణియై మన్తమై భక్తుల ననుగ్రహించు జగన్మాతకు నమస్కారము.
ఒక దేవతారాధన చేయటం కేవలమొక మంత్రం చదివి నమస్కరించటంతో సరికాదు. తాను దేవతయై దేవతనారాధించవలెనన్నది శాస్త్రవాక్యం. ఋషిన్యాస, కరన్యాస, అంగన్యాస, మాతృకాన్యాసాలు అందుకు ఉపకరణాలు. ఈ క్రమంలో ఇక్కడ గణేశ, గ్రహ, నక్షత్ర, యోగినీ, రాశి, పీఠన్యాసములారు చెప్పబడినవి. ఈ న్యాసరూపములలో జగన్మాత సాధకునియందే ఒదిగియున్నది. ఆమె నట్లే ఆరాధించవలెనని భావము. ఆ న్యాసముల.........
వామకేశ్వరీమతమ్ ఆంధ్రవ్యాఖ్యాసహితమ్ ప్రథమః పటలః శ్లో|| గణేశగ్రహనక్షత్రయోగినీరాశిరూపిణీమ్ | దేవీం మస్త్రమయీం నౌమి మాతృకాం పీఠరూపిణీమ్ ||ప్ర : గణేశ = గణేశులు, గ్రహ = గ్రహములు, నక్షత్ర = నక్షత్రములు, యోగినీ = యోగినులు, రాశి = రాశులు, వీని, రూపిణీమ్ = రూపములుగల, మన్తమయీమ్ = మంత్రమయియైన, పీఠరూపిణీమ్ = పీఠరూపములుగల, మాతృకాం దేవీమ్ = జగన్మాతయైన దేవిని, నౌమి = నమస్కరించుచున్నాను. ఇది మొదలు శ్లో. 12 వరకున్ను సర్వసిద్ధికృత స్తోత్రంగా పరిగణింపబడుతున్నవి. తా : గణేశులు, గ్రహములు, నక్షత్రములు, యోగినులు, రాశులు, అను స్థూలరూపము గలిగి, వివిధ పీఠముల రూపములతో నానాదేశసంస్థితయై, అక్షరవ్యవస్థారూపమున సాక్షాత్కరించు శక్తిస్వరూపిణియై మన్తమై భక్తుల ననుగ్రహించు జగన్మాతకు నమస్కారము. ఒక దేవతారాధన చేయటం కేవలమొక మంత్రం చదివి నమస్కరించటంతో సరికాదు. తాను దేవతయై దేవతనారాధించవలెనన్నది శాస్త్రవాక్యం. ఋషిన్యాస, కరన్యాస, అంగన్యాస, మాతృకాన్యాసాలు అందుకు ఉపకరణాలు. ఈ క్రమంలో ఇక్కడ గణేశ, గ్రహ, నక్షత్ర, యోగినీ, రాశి, పీఠన్యాసములారు చెప్పబడినవి. ఈ న్యాసరూపములలో జగన్మాత సాధకునియందే ఒదిగియున్నది. ఆమె నట్లే ఆరాధించవలెనని భావము. ఆ న్యాసముల.........© 2017,www.logili.com All Rights Reserved.