జీవితం కవిత్వం! ఈ రెంటికీ అవినాభావ సంబంధం ఉంది. నిస్సందేహంగా ఉంది. నింగికీ నేలకూ ఉన్నంత భవబంధం ఉంది. ఈ రెండూ కలవకపోయినా అంతఃఅనుసంధానమనేది ఉంది. అలాగే జీవితంతో కవిత్వానికి పేగుబంధం ఉంది. అది నిజం కాబట్టే బువ్వ కవితా సంకలనం మట్టి మనిషిలోని మానవ కోణాన్ని ప్రతిబింబించింది. కవిత్వం జీవితాన్ని ప్రతిబింబించాలంటారు. నిజమే.. ప్రతిబింబిస్తుంది కూడా. ప్రపంచంలో ఏ కవిత్వం తీసుకున్నా.. ఎవ్వరి కవిత్వం తీసుకున్నా అది ఏదొక కోణంలో జీవితాన్నే స్పృశిస్తుంది. కాకపొతే కాస్తంత హెచ్చుతగ్గులు. అంతే తేడా. కాని ఈ బువ్వ సంపుటి మాత్రం నూటికి నూరుపాళ్ళూ నికార్సయిన జీవితానికి అద్దంలా నిలిచింది. జీవితంలోని ప్రతి ఒక్క పార్శ్వం ఈ పుస్తకంలో కనిపించింది.