స్రవంతి ఐతరాజుగారి 'సౌగంధిక జాజరాలు' సుగంధ బంధురాలు. ఆమె కవిత్వంలో ప్రకృతి పరవళ్ళు తొక్కుతుంది.
ప్రేమ పొంగులు వారే జవ్వని వలపుతోటలో
మల్లెలతో వసంతమూ
చేమంతులతో హేమంతమూ
వీన్నెల శరత్తుల్లో పారిజాతమూ,
శిశిరంలో సంపంగెపూ స్వర్గమూ
ఇలా సమస్త రుతుసంరంభం ఈమె హృదయంలో ప్రేమ పొంగులు వారుతుంది. అది కవిత్వభారంతో కదుల్తుంది. ఆమెలో సున్నిత పార్శ్వముంది. అవ్యక్త మధురిమకు అక్షరాకృతి నివ్వడం ఆమెకు బాగా తెలుసు.
"నీ ప్రతీ జ్ఞాపకం శిరీష పుష్ప సున్నితత్వం
ఊహకందని ప్రతి సంగమం.
ఓ సుమధుర హృదయంగమం"
... ప్రతి కలయికలో 'ఆనంద ఆమని ఆవిష్కరణ' ఆ అజ్ఞాత స్వాప్నిక వ్యక్తి కోసం నిరంతరం విరహభారంతో ఎదురు చూపు. తొలికవితలు, తొలకరి కవితలు, నవనలోన్మేషమయిన, మలయా సమీర సద్రుశామయిన సుకుమార భావాలకు ఈమె సుందరాక్రుతి నిచ్చింది. అజ్ఞాతంగా దైవికంగా అబ్బిన విద్య అది.
స్రవంతిగారు నిత్య కవితాస్రవంతిగా సాగాలని కోరుకుంటూ - నమస్సులతో
- సౌభాగ్య
స్రవంతి ఐతరాజుగారి 'సౌగంధిక జాజరాలు' సుగంధ బంధురాలు. ఆమె కవిత్వంలో ప్రకృతి పరవళ్ళు తొక్కుతుంది. ప్రేమ పొంగులు వారే జవ్వని వలపుతోటలో మల్లెలతో వసంతమూ చేమంతులతో హేమంతమూ వీన్నెల శరత్తుల్లో పారిజాతమూ, శిశిరంలో సంపంగెపూ స్వర్గమూ ఇలా సమస్త రుతుసంరంభం ఈమె హృదయంలో ప్రేమ పొంగులు వారుతుంది. అది కవిత్వభారంతో కదుల్తుంది. ఆమెలో సున్నిత పార్శ్వముంది. అవ్యక్త మధురిమకు అక్షరాకృతి నివ్వడం ఆమెకు బాగా తెలుసు. "నీ ప్రతీ జ్ఞాపకం శిరీష పుష్ప సున్నితత్వం ఊహకందని ప్రతి సంగమం. ఓ సుమధుర హృదయంగమం" ... ప్రతి కలయికలో 'ఆనంద ఆమని ఆవిష్కరణ' ఆ అజ్ఞాత స్వాప్నిక వ్యక్తి కోసం నిరంతరం విరహభారంతో ఎదురు చూపు. తొలికవితలు, తొలకరి కవితలు, నవనలోన్మేషమయిన, మలయా సమీర సద్రుశామయిన సుకుమార భావాలకు ఈమె సుందరాక్రుతి నిచ్చింది. అజ్ఞాతంగా దైవికంగా అబ్బిన విద్య అది. స్రవంతిగారు నిత్య కవితాస్రవంతిగా సాగాలని కోరుకుంటూ - నమస్సులతో - సౌభాగ్య© 2017,www.logili.com All Rights Reserved.