ఒక కవితను నిర్వహించడంలో బండి సత్యనారాయణ చూపిన శబ్ద శ్రద్ధానూ, అన్వయ సామరస్యాన్నీ, శిల్ప ప్రత్యేకతను చెప్పడానికి పైన కవితను విస్తారంగా ఉదాహరించాను. అనుచితమైన మాటల్ని వాడకుండా పాఠకుడి ధ్యానస్థితి చెదరని వాతావరణాన్ని సృజించిన దాఖలాలు ఈ సంపుటిలో చాలా ఉన్నాయి. ఆధునిక జీవితంలోని అల్లకల్లోలాన్నీ, యాంత్రిక ధోరణుల్నీ, ధ్రవ్యాధిపత్యాన్నీ చాలా కవితల్లో చిత్రించాడీ కవి. ముఖ్యంగా 'పిచ్చి ముదిరాక' అనే కవిత ఇప్పటి మనిషి ముఖాన్ని స్ఫుటంగా చూపింది. "నిద్రపోయే వేళకి దుప్పటికి బదులు అసంతృప్తిని కప్పుకుంటాడు" అన్న చివరి పంక్తి ఔచిత్యవంతమైన ముక్తాయింపు.
రంగుల, మాయల, సాంకేతికతల, ముసుగులా, నాజూకుల, అబద్ధాల, లౌక్యాల మాయాపు ఆధునిక వాతావరణంలో బండి సత్యనారాయణ సరళంగా, స్పష్టంగా, తేటగా, అంకితభావంతో మనిషి సగటు జీవితపు దృశ్యాల్ని మనకళ్ళ ముందుంచాడు ఈ కవితల ద్వారా. వ్యాపార సంస్కృతి మనిషి తనాన్ని తినేస్తున్న సందర్భంలో ప్రత్యామ్నాయ సంస్కృతికి దాఖలా ఈ సంపుటి.
- దర్భశయనం శ్రీనివాసాచార్య
ఒక కవితను నిర్వహించడంలో బండి సత్యనారాయణ చూపిన శబ్ద శ్రద్ధానూ, అన్వయ సామరస్యాన్నీ, శిల్ప ప్రత్యేకతను చెప్పడానికి పైన కవితను విస్తారంగా ఉదాహరించాను. అనుచితమైన మాటల్ని వాడకుండా పాఠకుడి ధ్యానస్థితి చెదరని వాతావరణాన్ని సృజించిన దాఖలాలు ఈ సంపుటిలో చాలా ఉన్నాయి. ఆధునిక జీవితంలోని అల్లకల్లోలాన్నీ, యాంత్రిక ధోరణుల్నీ, ధ్రవ్యాధిపత్యాన్నీ చాలా కవితల్లో చిత్రించాడీ కవి. ముఖ్యంగా 'పిచ్చి ముదిరాక' అనే కవిత ఇప్పటి మనిషి ముఖాన్ని స్ఫుటంగా చూపింది. "నిద్రపోయే వేళకి దుప్పటికి బదులు అసంతృప్తిని కప్పుకుంటాడు" అన్న చివరి పంక్తి ఔచిత్యవంతమైన ముక్తాయింపు. రంగుల, మాయల, సాంకేతికతల, ముసుగులా, నాజూకుల, అబద్ధాల, లౌక్యాల మాయాపు ఆధునిక వాతావరణంలో బండి సత్యనారాయణ సరళంగా, స్పష్టంగా, తేటగా, అంకితభావంతో మనిషి సగటు జీవితపు దృశ్యాల్ని మనకళ్ళ ముందుంచాడు ఈ కవితల ద్వారా. వ్యాపార సంస్కృతి మనిషి తనాన్ని తినేస్తున్న సందర్భంలో ప్రత్యామ్నాయ సంస్కృతికి దాఖలా ఈ సంపుటి. - దర్భశయనం శ్రీనివాసాచార్య© 2017,www.logili.com All Rights Reserved.