పీఠిక
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత జరిగిన ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన పాలనలోను అదే కాలంలో కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారి పాలనలోను సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, విద్యా రంగాల్లో పాలకులు చేసిన ద్రోహాన్ని ప్రమాణ బద్ధంగా ఈ గ్రంథంలో రాయడం జరిగింది.
మొదటి చాప్టర్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునాదిని దెబ్బతీస్తున్న చంద్రబాబు అనే విభాగంలో ఆర్థిక సంక్షోభం గురించి ఇలా విశ్లేషించారు. "ప్రభుత్వం సంవత్సర మొత్తానికి అంచనా వేసిన రెవెన్యూ లోటు కన్నా ఈ ఆరు నెలల కాలంలో నమోదైన రెవెన్యూలోటే ఎక్కువ. ద్రవ్యలోటు రూ.13,673.41 కోట్లుగా తేలింది. అది రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 1.89 శాతానికి సమానం. ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధి లక్ష్యాలను సాధించలేకపోతే ద్రవ్యలోటు బాగా పెరుగుతుంది. ఈ గణాంక వివరాలను పరిశీలిస్తే ఆర్థిక లక్ష్యాలను సాధించటం కష్టమే అనిపిస్తోంది. పరిశ్రమల వృద్ధి లక్ష్యం 16.69 శాతం. అవి 10.49 శాతమే వృద్ధి సాధించాయి. సేవారంగం 15.90%. ఈ రంగం సాధించిన వృద్ధి 10.16% రాష్ట్ర ఆదాయం కోసం మద్యం లేదా పెట్రో ఉత్పత్తులపై పన్నుల మీద అధికంగా ఆధారపడుతుంది. ఈ రెండూ కలిపి ఏప్రియల్-డిసెంబర్ మధ్య కాలానికి దాదాపు రూ. 12,000 కోట్ల మేరకు ఆదాయం సమకూర్చాయి.
చంద్రబాబు కులాధిపత్య రాజకీయవేత్త. సంపదను దోచి సొంత కులానికి ధారబోయాలి అనే స్వభావం కలవాడు. ఆయన కులవాది, మతవాది. ఆర్థిక దోపిడీని నిరంతరం కొనసాగించే అవినీతి పరుడు. చంద్రబాబు ఆంధ్రులకు చేసిన ద్రోహాన్ని ఈ పుస్తకం సప్రమాణంగా నిరూపిస్తుంది.
© 2017,www.logili.com All Rights Reserved.