పుట్టిన ప్రతి ఒక్కడు బ్రతుకుతున్నాను
అనుకుంటున్నాడు !
బ్రతడం అంటే బ్రతికి ఉండడం కాదు!
అనురాగాలు అతికి ఉండడం !
అమ్మ నేర్పిన విలువలు మతికి ఉండడం !
ఆనందాలను వెతుకుతుండడం!
అనుబంధాలతో బ్రతుకుతుండడం !
డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కడు
ఉన్నోడు అనుకుంటున్నాడు !
ఉన్నోడు అంటే డబ్బున్నోడు కాదు !
మంచు లాంటి మంచి మనసున్నోడు !
మనిషిని మనిషిలా చుస్తున్నోడు !
మంచి కోసమే అడుగులు వేస్తున్నోడు !
మర్చిపోయిన మానవత్వాన్ని గుర్తు చేస్తున్నోడు !
డబ్బులో మునిగిపొయ్యి , బ్రతకడం మర్చిపొయ్యి ,
ఆస్తుల కోసం చచ్చిపొయ్యి, పొయ్యిలో కాలుతున్న
కట్టేలా మారుతున్న మనం... మనుషుల్లా
మారడానికి మళ్ళీ పుట్టాలేమో ! ఇలా చస్తూ
బ్రతికేకంటే చచ్చి మళ్ళీ పుట్టడమే మెలోమో !
- కృష్ణ చైతన్యా రెడ్డి, వంశి కృష్ణా రెడ్డి