ప్రపంచ చరిత్రను టూకీగానైనా ఆసక్తి కలిగించేట్లు రాయడం ఆషామాషీ వ్యవహారం కాదు. చరిత్ర రచనకు ముడిసరుకు ఏదో, ఎక్కడెక్కడ ఉందో తెలుసుకోవడం, ఆ ఆకరాల నుంచి సమాచారాన్ని సేకరించడం, పొల్లు పక్కనపెట్టి గట్టి గింజలను ఒక క్రమపద్ధతిలో కూర్చడం యాతనతో కూడుకున్న పని.
ఇప్పటి వరకు ప్రపంచ మానవాళిని ప్రభావితం చేసిన సంకుచిత విశ్వాలనూ, శాస్త్రవిజ్ఞానాన్నీ, అపారమైన మౌఖిక, లిఖిత సాహిత్యాన్నీ వింగడించడం ఒక ఎత్తు; భూమి పుట్టుక, జీవ పదార్థాల పరిమాణం, మనిషి ఎదుగుదలలోని భిన్న చారిత్రిక దశలను గుర్తిస్తూ, నాగారికతల్లోని తేడాలను ఎత్తిచూపుతూ, రాజ్యాల పుట్టుకలనూ, ఉత్థాన పతనాలను తెలపడం మరొక ఎత్తు. మరీ కష్టమైనా పని - మత ప్రవక్తల చుట్టూ అల్లుకున్న కట్టుకథల కంటే వాళ్ళ సామాజిక దృష్టినీ, తర్వాతరువాత వచ్చిన పరిణామాలనూ వివరించడం. అట్లాగే చరిత్ర రచనకు ఒక సందర్భం, నేపథ్యం ఉంటుందని గుర్తించి రాయడం.
ప్రపంచ చరిత్రను టూకీగానైనా ఆసక్తి కలిగించేట్లు రాయడం ఆషామాషీ వ్యవహారం కాదు. చరిత్ర రచనకు ముడిసరుకు ఏదో, ఎక్కడెక్కడ ఉందో తెలుసుకోవడం, ఆ ఆకరాల నుంచి సమాచారాన్ని సేకరించడం, పొల్లు పక్కనపెట్టి గట్టి గింజలను ఒక క్రమపద్ధతిలో కూర్చడం యాతనతో కూడుకున్న పని. ఇప్పటి వరకు ప్రపంచ మానవాళిని ప్రభావితం చేసిన సంకుచిత విశ్వాలనూ, శాస్త్రవిజ్ఞానాన్నీ, అపారమైన మౌఖిక, లిఖిత సాహిత్యాన్నీ వింగడించడం ఒక ఎత్తు; భూమి పుట్టుక, జీవ పదార్థాల పరిమాణం, మనిషి ఎదుగుదలలోని భిన్న చారిత్రిక దశలను గుర్తిస్తూ, నాగారికతల్లోని తేడాలను ఎత్తిచూపుతూ, రాజ్యాల పుట్టుకలనూ, ఉత్థాన పతనాలను తెలపడం మరొక ఎత్తు. మరీ కష్టమైనా పని - మత ప్రవక్తల చుట్టూ అల్లుకున్న కట్టుకథల కంటే వాళ్ళ సామాజిక దృష్టినీ, తర్వాతరువాత వచ్చిన పరిణామాలనూ వివరించడం. అట్లాగే చరిత్ర రచనకు ఒక సందర్భం, నేపథ్యం ఉంటుందని గుర్తించి రాయడం.© 2017,www.logili.com All Rights Reserved.