శ్రీమతి సముద్రాల శ్రీదేవి రచించిన కవితా సంపుటిలో భావుకత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. శ్రీదేవి కవితా రచనా ప్రతిభకు నా ఆశీస్సులు.
డా సి. నారాయణ రెడ్డి. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత
సముద్రం తనలో బడబాగ్ని రగులుతున్నా గంభీరంగా ఉంటూ అలల సోయగాలతో అందరికీ ఆహ్లాదాన్ని పంచినట్టు సముద్రాల శ్రీదేవి గృదాయంలో ఆలోచనల బడబాగ్నులెన్నున్నా అవన్నీ అద్భుత కవితలుగా వెలువడి కవితాప్రియుల హృదయాలను రసప్లావితం చేస్తాయనడంలో నాకెట్టి సందేహం లేదు.
- బిక్కి కృష్ణ ప్రముఖ కవి
శ్రీదేవి గారి కవితా ఒక భావన భాండాగారం. ఆమె ప్రయోగించిన సరళ పదాలు కవిత్వానికి మరింత వన్నె తెచ్చాయి. కవిత ఒక భావలాలిత్వం. ఒక భాష విన్యాసం. శ్రీదేవిగారి కవిత్వం మృదులం. మధురం.
- వై. ఎస్. ఆర్. శర్మ, సంపాదకులు ఆంధ్రప్రభ
రచయిత్రి తన హృదయాన్ని అద్భుతంగా మనముందు పరచారు. అక్షరాలతో నాట్యం చేయించారు. శబ్దానికి భావానికి ఉన్న సంబంధాన్ని విడమరచి చెప్పారు. వాడిని పదాలు భావాలు లలితంగా వుండి వస్తువు యొక్క ఔన్నత్యాన్ని పెంచే విధంగా వున్నాయి.
- ప్రభాకర్ జైని, కవి, నవలా రచయిత, సినిమా దర్శకులు
శ్రీదేవిగారు ఒక వైపు భావకవిత్వాన్ని రాస్తూనే మరొకవైపు అభ్యుదయ కవిత్వాన్ని వెలిబుచ్చారు. తనదైన శైలితో భావగాంభీర్యంతో కవితా రచన సాగింది.
- కందుకూరి శ్రీరాములు, ప్రముఖ కవి
- సముద్రాల శ్రీదేవి