గౌరవనీయుడు, కవి, రాజకీయవేత్త, మాజీమంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష - నేత; సహృదయుడు అయిన డాక్టర్ రషీద్ పెల్పువొ, హాఫ్రికన్ ప్రిన్స్ గా పేరొందిన వాహిద్ మూసా ల ఆహ్వానంతో 'ఘనా' దేశాన్ని 2018లో సందర్శించినపుడు ఆ పరిచయమైన కవయిత్రి ఈడెన్ యస్. ట్రినిడాడ్. ఆమెలోని విలకణ మనసత్యం, ఇతరులకు సాయంచేసే వ్యక్తిత్వం, కలుపుగోలుదనం, మమ్మల్ని సహితులుగా చేసింది. ఆమె పెంటాసి-బి కవిత్వ సమూహంలో సభ్యురాలు.
ఆమె కవిత్వం మామూలుగా ఉన్నా, చక్కని ఆలోచనలు మెరుపుల్లా మనల్ని కట్టి పడవేస్తాయి. ఉపాధ్యాయురాలిగా ఆమెకున్న అనుభవం, నిత్యజీవితంలోని సంఘటనలను నిశితంగా పరిశీలించే తత్త్వంతో ప్రేమ అంతస్సూత్రంగా ఆమె తన కవితలను మలుస్తుంది.
ఈడెన్ వనంలోని పుష్పాల్లా ఈ కవితలు కవిత్వ పరిమళాలను వెదజల్లుతాయి. ఉపాధ్యాయురాలిగా, సమాజ సేవికగా ఆమెకున్న అనుభవం, జ్ఞానం, సేవాదృష్టిని మనం ఈ కవితలలో గమనించగలం. ప్రపంచ కవుల కవిత్వాన్ని తెలుగు సాహితీలోకానికి పరిచయం చేసే ప్రయత్నంలో భాగమైన ఈ కవితాసంపుటిని సాహితీప్రియులు విశేషంగా ఆదరిస్తారని నమ్ముతూ....
- డాక్టర్ లంకా శివరామప్రసాద్
గౌరవనీయుడు, కవి, రాజకీయవేత్త, మాజీమంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష - నేత; సహృదయుడు అయిన డాక్టర్ రషీద్ పెల్పువొ, హాఫ్రికన్ ప్రిన్స్ గా పేరొందిన వాహిద్ మూసా ల ఆహ్వానంతో 'ఘనా' దేశాన్ని 2018లో సందర్శించినపుడు ఆ పరిచయమైన కవయిత్రి ఈడెన్ యస్. ట్రినిడాడ్. ఆమెలోని విలకణ మనసత్యం, ఇతరులకు సాయంచేసే వ్యక్తిత్వం, కలుపుగోలుదనం, మమ్మల్ని సహితులుగా చేసింది. ఆమె పెంటాసి-బి కవిత్వ సమూహంలో సభ్యురాలు. ఆమె కవిత్వం మామూలుగా ఉన్నా, చక్కని ఆలోచనలు మెరుపుల్లా మనల్ని కట్టి పడవేస్తాయి. ఉపాధ్యాయురాలిగా ఆమెకున్న అనుభవం, నిత్యజీవితంలోని సంఘటనలను నిశితంగా పరిశీలించే తత్త్వంతో ప్రేమ అంతస్సూత్రంగా ఆమె తన కవితలను మలుస్తుంది. ఈడెన్ వనంలోని పుష్పాల్లా ఈ కవితలు కవిత్వ పరిమళాలను వెదజల్లుతాయి. ఉపాధ్యాయురాలిగా, సమాజ సేవికగా ఆమెకున్న అనుభవం, జ్ఞానం, సేవాదృష్టిని మనం ఈ కవితలలో గమనించగలం. ప్రపంచ కవుల కవిత్వాన్ని తెలుగు సాహితీలోకానికి పరిచయం చేసే ప్రయత్నంలో భాగమైన ఈ కవితాసంపుటిని సాహితీప్రియులు విశేషంగా ఆదరిస్తారని నమ్ముతూ.... - డాక్టర్ లంకా శివరామప్రసాద్
© 2017,www.logili.com All Rights Reserved.