ఫ్లోరిడా నుండి బయల్దేరిన విమానం 36000 అడుగుల ఎత్తులో 980కెఎంపిహెచ్ వేగంతో దూసుకుపోతుంది. కిటికీ పక్కన కూర్చున్న ఇరవై ఎనిమిదేళ్ళ ఎరోస్పేస్ ఇంజనీర్ చైతన్య అలా అభావంగా చూశాడు. అన్నీ వెండికొండల్లా ధగదగా మెరుస్తున్న మేఘాలు. ఒట్టి ఉనికిమాత్రమే కలిగి, నిర్దుష్ట రూపం, నియమిత స్థానం, విస్పష్ట ప్రవర్తన, ఏదీలేని ఈ మేఘాలేమిటి? మేఘాల వెనుక, ముందు, క్రింద, మీద.. శూన్యంవలె భ్రమింపజేసే ఏదీలేదని మనమనుకునే ఈ 'ఏమీ లేనితనం" నిజంగా ఏమీ లేకపోవడమేనా.. లేనివన్నీ నిజంగా కంటికి కనిపించక. కంటికి కనిపించేవన్నీ నిజంగా ఉన్నట్టేనా. కనిపించని ప్రాణం.. కనిపించని గాలి.. కనిపించని పరిమళం.. కనిపించని స్పర్శ.. ఇంకా ఎన్నో ఎన్నో.. అన్నీ కనపడకుండానే మనిషి అనుభవంలోకి వస్తున్నాయి కదా.
మనిషి ఉంటూ కూడా ఏమీలేనివానిగా, ఒట్టి అముద్రగా ఎన్నిసార్లు మిగలడం లేదు. ఉన్నట్టనిపించే ఎండమావి, లేక లేనట్టనిపించే నిశ్శబ్ద ధ్వని ఉండి.. ప్రతిదీ ఉండీలేనట్టయి, ద్వంద్వామై, భిన్నమై, మళ్ళీ అభిన్నమై, భౌతికమై, అభౌతికమై, కనపడని ప్రతిద్రవ్యాలు.. కనిపిస్తూ ప్రచలితం కాని ద్రవ్యరాశులు.. ఈ సృష్టి.. ఈ ప్రపంచం.. ఈ ద్రవ్య ప్రతిద్రవ్య సమ్మేళనాల మహారహస్య క్రీడ.. ఒక నిరంతర చరాచర అనువర్తనాల అనుస్పందనలు.. నిశ్శబ్దంగా.. భీకరంగా.. ఒక్కోసారి ప్రళయార్భటులతో, విస్ఫోటనాలతో.. మరోసారి మౌన మహాంతర్ముఖతతో ఈ మానవ సంవేదనలన్నీ, సంస్పందనలన్నీ ఏమిటి, ఎక్కడ ఆది, ఎక్కడ విస్తరణ, ఏది అంతం, ఏది ఆరంభం, ఏది కొస. తరువాత ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
ఫ్లోరిడా నుండి బయల్దేరిన విమానం 36000 అడుగుల ఎత్తులో 980కెఎంపిహెచ్ వేగంతో దూసుకుపోతుంది. కిటికీ పక్కన కూర్చున్న ఇరవై ఎనిమిదేళ్ళ ఎరోస్పేస్ ఇంజనీర్ చైతన్య అలా అభావంగా చూశాడు. అన్నీ వెండికొండల్లా ధగదగా మెరుస్తున్న మేఘాలు. ఒట్టి ఉనికిమాత్రమే కలిగి, నిర్దుష్ట రూపం, నియమిత స్థానం, విస్పష్ట ప్రవర్తన, ఏదీలేని ఈ మేఘాలేమిటి? మేఘాల వెనుక, ముందు, క్రింద, మీద.. శూన్యంవలె భ్రమింపజేసే ఏదీలేదని మనమనుకునే ఈ 'ఏమీ లేనితనం" నిజంగా ఏమీ లేకపోవడమేనా.. లేనివన్నీ నిజంగా కంటికి కనిపించక. కంటికి కనిపించేవన్నీ నిజంగా ఉన్నట్టేనా. కనిపించని ప్రాణం.. కనిపించని గాలి.. కనిపించని పరిమళం.. కనిపించని స్పర్శ.. ఇంకా ఎన్నో ఎన్నో.. అన్నీ కనపడకుండానే మనిషి అనుభవంలోకి వస్తున్నాయి కదా. మనిషి ఉంటూ కూడా ఏమీలేనివానిగా, ఒట్టి అముద్రగా ఎన్నిసార్లు మిగలడం లేదు. ఉన్నట్టనిపించే ఎండమావి, లేక లేనట్టనిపించే నిశ్శబ్ద ధ్వని ఉండి.. ప్రతిదీ ఉండీలేనట్టయి, ద్వంద్వామై, భిన్నమై, మళ్ళీ అభిన్నమై, భౌతికమై, అభౌతికమై, కనపడని ప్రతిద్రవ్యాలు.. కనిపిస్తూ ప్రచలితం కాని ద్రవ్యరాశులు.. ఈ సృష్టి.. ఈ ప్రపంచం.. ఈ ద్రవ్య ప్రతిద్రవ్య సమ్మేళనాల మహారహస్య క్రీడ.. ఒక నిరంతర చరాచర అనువర్తనాల అనుస్పందనలు.. నిశ్శబ్దంగా.. భీకరంగా.. ఒక్కోసారి ప్రళయార్భటులతో, విస్ఫోటనాలతో.. మరోసారి మౌన మహాంతర్ముఖతతో ఈ మానవ సంవేదనలన్నీ, సంస్పందనలన్నీ ఏమిటి, ఎక్కడ ఆది, ఎక్కడ విస్తరణ, ఏది అంతం, ఏది ఆరంభం, ఏది కొస. తరువాత ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.