ఎన్నో కల్పాల చరిత్ర కలిగిన హిందూధర్మం గురించి చెప్పాలంటే అది హిందూ మహాసముద్రం అంత ఉంటుంది. సృష్టి ఎంత ప్రాచీనమో, హిందూధర్మం అంత ప్రాచీనమైనది. మన ధర్మానికి మతగ్రంథం ఏదైనా ఉందా...! అంటే ఇతర మతస్థులకు ఉంది కనుక మనం ఏదో పేరు చెప్పుకోవాలి కానీ... గ్రంథాల మీద ఆధారపడి వచ్చింది కాదు హిందూధర్మం.
హిందూధర్మం మీద అవగాహన లేనివారికి, ఈ దేశంలో పుట్టనివారికి, ఈ దేశపు సంప్రదాయం తెలియనివారికి హిందూధర్మం అంటే ఏమిటో చెప్పి, వారి చేత ఆ ధర్మమునకు నమస్కరింపజేశారు స్వామి వివేకానంద.
స్వాతంత్య్రం రాకముందు 'వందేమాతరం' అనడానికి భయపడేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 'హిందూ' శబ్దం అనడానికి భయపడే పరిస్థితిలో ఉన్నారు.
హిందూమతం - పుట్టుపూర్వోత్తరాలు
'హిందూ' అనే శబ్దం చాలా విశేషమైనది. 'హిందూ' శబ్దం ఈ మతం పుట్టినప్పటి నుండే ఉందా? కాదు. సనాతన ధర్మము, ఆర్షధర్మము, భారతీయధర్మము, వైదికధర్మము - ఇవి హిందూధర్మమునకు ఉన్న పేర్లు. ఈ పేర్లు అర్థం తెలుసుకుంటే హిందూధర్మం స్వరూపం, స్వభావం అర్థం అవుతుంది. దాని వల్ల ఏర్పడే ప్రభావం తరువాత పరిశీలించవచ్చు.
సనాతనం - సనాతనం అనే మాటకు 'శాశ్వతం' అని అర్థం. ఇది మార్పు చెందేది కాదు. నిన్ననో, మొన్ననో పుట్టినది కాదు. శాశ్వత శబ్దానికి ఆంగ్లంలో Eternal (ఎటర్నల్) అని అర్థం. సూర్యుడు, చంద్రుడు, ప్రకృతి ఎంత శాశ్వతమో,.............
హిందూధర్మం స్వరూపం - స్వభావం - ప్రభావం ఎన్నో కల్పాల చరిత్ర కలిగిన హిందూధర్మం గురించి చెప్పాలంటే అది హిందూ మహాసముద్రం అంత ఉంటుంది. సృష్టి ఎంత ప్రాచీనమో, హిందూధర్మం అంత ప్రాచీనమైనది. మన ధర్మానికి మతగ్రంథం ఏదైనా ఉందా...! అంటే ఇతర మతస్థులకు ఉంది కనుక మనం ఏదో పేరు చెప్పుకోవాలి కానీ... గ్రంథాల మీద ఆధారపడి వచ్చింది కాదు హిందూధర్మం. హిందూధర్మం మీద అవగాహన లేనివారికి, ఈ దేశంలో పుట్టనివారికి, ఈ దేశపు సంప్రదాయం తెలియనివారికి హిందూధర్మం అంటే ఏమిటో చెప్పి, వారి చేత ఆ ధర్మమునకు నమస్కరింపజేశారు స్వామి వివేకానంద. స్వాతంత్య్రం రాకముందు 'వందేమాతరం' అనడానికి భయపడేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 'హిందూ' శబ్దం అనడానికి భయపడే పరిస్థితిలో ఉన్నారు. హిందూమతం - పుట్టుపూర్వోత్తరాలు 'హిందూ' అనే శబ్దం చాలా విశేషమైనది. 'హిందూ' శబ్దం ఈ మతం పుట్టినప్పటి నుండే ఉందా? కాదు. సనాతన ధర్మము, ఆర్షధర్మము, భారతీయధర్మము, వైదికధర్మము - ఇవి హిందూధర్మమునకు ఉన్న పేర్లు. ఈ పేర్లు అర్థం తెలుసుకుంటే హిందూధర్మం స్వరూపం, స్వభావం అర్థం అవుతుంది. దాని వల్ల ఏర్పడే ప్రభావం తరువాత పరిశీలించవచ్చు. సనాతనం - సనాతనం అనే మాటకు 'శాశ్వతం' అని అర్థం. ఇది మార్పు చెందేది కాదు. నిన్ననో, మొన్ననో పుట్టినది కాదు. శాశ్వత శబ్దానికి ఆంగ్లంలో Eternal (ఎటర్నల్) అని అర్థం. సూర్యుడు, చంద్రుడు, ప్రకృతి ఎంత శాశ్వతమో,.............© 2017,www.logili.com All Rights Reserved.