శ్రీ వాల్మీకి రామాయణం
బాలకాండ
అది వాల్మీకి మహర్షి ఆశ్రమం . పరమపావనమైన గంగానదీ తీరంలో ఉండేది ఆ ఆశ్రమం.
అక్కడ అన్ని కాలాలలోనూ అన్ని అవస్థలలోనూ నిష్ఠగా తపస్సును ఆచరిస్తూ ఉండేవాడు వాల్మీకి మహర్షి.
ఆ మహర్షి దగ్గరకు ఒకరోజు నారదమహర్షి స్వయంగా వచ్చాడు. ఆ నారదుడు ఎలాంటివాడంటే... తపఃస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్ | నారదం పరిపప్రచ్చ వాల్మీకి ర్మునిపుంగవమ్ || (1-1)
ఎప్పుడూ వేదాధ్యయనం చేయడంలో ఆసక్తి కలవాడు, తపస్వి, చక్కగా మాట్లాడే నైపుణ్యం ఉన్నవారిలో శ్రేష్ఠుడు, మునిశేఖరుడూనూ.
అలాంటి నారదమహర్షి స్వయంగా తనవద్దకు రావడంతో వాల్మీకి మహర్షి సంబరపడిపోయాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆశతో ఇలా అంటున్నాడు నారదుడితో.
మహరీ! మేటి గుణవంతుడు, యుద్ధంలో ఎంతటి శత్రువునైనా ధైర్యంగా జయించగల్గినవాడు, ధర్మాత్ముడు, చేసిన మేలు మర్చిపోనివాడు, నిత్యసత్యవాది, అనుకున్న పనిని దృఢసంకల్పంతో నెరవేర్చేవాడు, అన్ని.............
శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ అది వాల్మీకి మహర్షి ఆశ్రమం . పరమపావనమైన గంగానదీ తీరంలో ఉండేది ఆ ఆశ్రమం. అక్కడ అన్ని కాలాలలోనూ అన్ని అవస్థలలోనూ నిష్ఠగా తపస్సును ఆచరిస్తూ ఉండేవాడు వాల్మీకి మహర్షి. ఆ మహర్షి దగ్గరకు ఒకరోజు నారదమహర్షి స్వయంగా వచ్చాడు. ఆ నారదుడు ఎలాంటివాడంటే... తపఃస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్ | నారదం పరిపప్రచ్చ వాల్మీకి ర్మునిపుంగవమ్ || (1-1) ఎప్పుడూ వేదాధ్యయనం చేయడంలో ఆసక్తి కలవాడు, తపస్వి, చక్కగా మాట్లాడే నైపుణ్యం ఉన్నవారిలో శ్రేష్ఠుడు, మునిశేఖరుడూనూ. అలాంటి నారదమహర్షి స్వయంగా తనవద్దకు రావడంతో వాల్మీకి మహర్షి సంబరపడిపోయాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆశతో ఇలా అంటున్నాడు నారదుడితో. మహరీ! మేటి గుణవంతుడు, యుద్ధంలో ఎంతటి శత్రువునైనా ధైర్యంగా జయించగల్గినవాడు, ధర్మాత్ముడు, చేసిన మేలు మర్చిపోనివాడు, నిత్యసత్యవాది, అనుకున్న పనిని దృఢసంకల్పంతో నెరవేర్చేవాడు, అన్ని.............© 2017,www.logili.com All Rights Reserved.