ఎవరికి ప్రేమ తన రెక్కల్ని పొదగలేదో వాళ్లు యీ దృశ్యాత్మకమైన మబ్బుల్ని దాటి ఆ ఆనందం విషాద సమయంలో నిలిచిన మా ఆత్మల మంత్ర లోకాన్ని వీక్షించలేదు. ప్రేమ తన అనుచరులుగా ఎవరిని బాధించదో వాళ్లు ప్రేమ పిలుపుల్ని వినలేరు. వాళ్లు యీ పుస్తక పుటల్ని అర్థం చేసుకున్నా మాటల ఆహార్యంలో, కాగితపు ఉపరితలంపై నివసించని ఆ అంతరార్థాన్ని గ్రహించలేరు. ప్రేమ పాత్ర నుంచి ఎన్నడు మధువుని గ్రోలనివాడు ఏమి మానవుడు? స్త్రీ పురుషుల హృదయాల బాటలో, రహస్య కలల
ఆకాశపు నీడల్లో వెలిగే బలిపీఠపు ముందు భక్తిగా తలవొంచి నిలవని ఆత్మ! ఏమి ఆత్మ ? తొలి పొద్దు తన రేకులపై మంచు బిందువులు జారని పూవు కూడా పూవేనా! సముద్రాన్ని చేరక మునుపే దారి తప్పిపోయిన సెలయేరు కూడా సెలయేరేనా?
ఎవరికి ప్రేమ తన రెక్కల్ని పొదగలేదో వాళ్లు యీ దృశ్యాత్మకమైన మబ్బుల్ని దాటి ఆ ఆనందం విషాద సమయంలో నిలిచిన మా ఆత్మల మంత్ర లోకాన్ని వీక్షించలేదు. ప్రేమ తన అనుచరులుగా ఎవరిని బాధించదో వాళ్లు ప్రేమ పిలుపుల్ని వినలేరు. వాళ్లు యీ పుస్తక పుటల్ని అర్థం చేసుకున్నా మాటల ఆహార్యంలో, కాగితపు ఉపరితలంపై నివసించని ఆ అంతరార్థాన్ని గ్రహించలేరు. ప్రేమ పాత్ర నుంచి ఎన్నడు మధువుని గ్రోలనివాడు ఏమి మానవుడు? స్త్రీ పురుషుల హృదయాల బాటలో, రహస్య కలల ఆకాశపు నీడల్లో వెలిగే బలిపీఠపు ముందు భక్తిగా తలవొంచి నిలవని ఆత్మ! ఏమి ఆత్మ ? తొలి పొద్దు తన రేకులపై మంచు బిందువులు జారని పూవు కూడా పూవేనా! సముద్రాన్ని చేరక మునుపే దారి తప్పిపోయిన సెలయేరు కూడా సెలయేరేనా?© 2017,www.logili.com All Rights Reserved.