భారతదేశములో కొన్నివేల గ్రామములున్నవి. అయితే అవన్నీ చరిత్ర కెక్కలేవు. కొన్ని కొన్ని గ్రామములు అవి ఎంత చిన్నవైనప్పటికీ మహాత్ముల పాదస్పర్శ సోకుటచేతను, వారక్కడ నివసించుట చేతను పవిత్రములై తరించి లోక ప్రఖ్యాతి గాంచుచున్నవి. కురుపురము శ్రీపాద శ్రీ వల్లభుని వలననూ, గాణుగాపురము శ్రీ నృసింహ సరస్వతి స్వామి వలననూ,షిరిడీ గ్రామము సాయిబాబా వలననూ, ప్రాముఖ్యము పొందినట్లే కల్లూరు గ్రామము తాత పాదస్పర్శకు నోచుకుని ధన్యత నొందింది. బాల్యమునందే కల్లూరు చేరిన తాతగారు తన అవతార ప్రకటననూ, అవతార సమాప్తినీ కూడా ఈ గ్రామము నందే గావించి ఇచటనే స్థిర నివాసులయ్యిరి. గంగామాత వంటి పుణ్యనది కూడా ఎప్పుడెప్పుడు మహాత్ముల తనకంటిన పాపాలు పోతాయా అని ఎదురుచూస్తుంటుంటే ఇక నిత్యమూ తాతవంటి మహనీయుని పాదస్పర్శచే పులకించి తరించిన కల్లూరు నేల పుణ్యక్షేత్రముగా మారి లోకప్రఖ్యాతి గాంచుటలో వింతేమీ లేదు.
- టి. శైలజ

Features
: Sri Ramavadhuta Jeevitha Charitra
: T Sailaja
: Sri Sri Avadhootha Ramireddy Thatha Seva Samsthan