చిన్న సాహసం
గత సంవత్సరం 'లాక్ డౌన్' కాలంలో ప్రత్యేకంగా ఏదైనా అంశంపై అధ్యయనం చెయ్యాలనుకొని, 'ఏలూరు సాహిత్య చరిత్ర'ను ప్రారంభించాను. ఆధునిక సాహిత్యానికి పూర్వపు చరిత్రను పరిశీలించే క్రమంలో 18, 19 శతాబ్దాలలో ఏలూరుకు చెందిన కావలి సోదరులు' చేసిన వాఙ్మయ కృషిని అధ్యయనం చేశాను. అది నన్ను విస్మయపరచింది. దీంతో ఏలూరు సాహిత్య చరిత్రను కాస్త పక్కకు జరిపి కైఫీయతుల పరిశీలన మొదలుపెట్టాను.
కైఫియతులను, వాటి వికాసాన్ని సొంతంగా భావించాల్సింది ముఖ్యంగా పశ్చిమ గోదావరి వాసులే. ఎందుకంటే మొత్తం దక్కన్ ప్రాంతంలో స్థానిక చరిత్రలను తవ్వి తీయటంలో, చారిత్రక సంపదను భద్రపరచి మనకందించటంలో జరిగిన కృషిలో తొలిపూజ్యత మెకంజీది కాగా, తమ మేధాశక్తితో ఆ కృషికి రూపాన్ని అందించిన వాళ్ళు ఏలూరుకు చెందిన కావలి సోదరులు. కావలి సోదరులు లేకపోతే. కైఫియతుల రచన' ప్రశ్నార్థకమయ్యేది. "మెకంజీ కైఫియతులు" అనే పేరు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ నిజానికి వాటిని 'కావలి సోదరుల కైఫియతులు' అనాలి. సాహితీపరులు ఎప్పటికీ విస్మరించకూడని వాఙ్మయ ద్రష్టలు కావలి సోదరులు. ఈ రచనకు వారే స్ఫూర్తి. అందుకే కావలి బొర్రయ్య, లక్ష్మయ్య, రామస్వామిచేసిన వాఙ్మయ కృషిని స్థూలంగా పరిచయం చేశాను. అలాగే వారికి ఆశ్రయమిచ్చి గొప్పగా ఆదరించిన కల్నల్ మెకంజీని 'తలంచాను'. నిజానికి వీరి కృషిని ప్రత్యేక అధ్యయనం ద్వారా వెలికి తీయాల్సింది ఉంది.
కైఫియతుల గురించి ఒక మేరకు అవగాహన వున్నప్పటికి ఒక ప్రక్రియగా అవి రూపొందిన విధానం, వాటి లోతులు, విశేషాలు నాకేమీ తెలీదు. అంటే ఒక్క.............
చిన్న సాహసం గత సంవత్సరం 'లాక్ డౌన్' కాలంలో ప్రత్యేకంగా ఏదైనా అంశంపై అధ్యయనం చెయ్యాలనుకొని, 'ఏలూరు సాహిత్య చరిత్ర'ను ప్రారంభించాను. ఆధునిక సాహిత్యానికి పూర్వపు చరిత్రను పరిశీలించే క్రమంలో 18, 19 శతాబ్దాలలో ఏలూరుకు చెందిన కావలి సోదరులు' చేసిన వాఙ్మయ కృషిని అధ్యయనం చేశాను. అది నన్ను విస్మయపరచింది. దీంతో ఏలూరు సాహిత్య చరిత్రను కాస్త పక్కకు జరిపి కైఫీయతుల పరిశీలన మొదలుపెట్టాను. కైఫియతులను, వాటి వికాసాన్ని సొంతంగా భావించాల్సింది ముఖ్యంగా పశ్చిమ గోదావరి వాసులే. ఎందుకంటే మొత్తం దక్కన్ ప్రాంతంలో స్థానిక చరిత్రలను తవ్వి తీయటంలో, చారిత్రక సంపదను భద్రపరచి మనకందించటంలో జరిగిన కృషిలో తొలిపూజ్యత మెకంజీది కాగా, తమ మేధాశక్తితో ఆ కృషికి రూపాన్ని అందించిన వాళ్ళు ఏలూరుకు చెందిన కావలి సోదరులు. కావలి సోదరులు లేకపోతే. కైఫియతుల రచన' ప్రశ్నార్థకమయ్యేది. "మెకంజీ కైఫియతులు" అనే పేరు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ నిజానికి వాటిని 'కావలి సోదరుల కైఫియతులు' అనాలి. సాహితీపరులు ఎప్పటికీ విస్మరించకూడని వాఙ్మయ ద్రష్టలు కావలి సోదరులు. ఈ రచనకు వారే స్ఫూర్తి. అందుకే కావలి బొర్రయ్య, లక్ష్మయ్య, రామస్వామిచేసిన వాఙ్మయ కృషిని స్థూలంగా పరిచయం చేశాను. అలాగే వారికి ఆశ్రయమిచ్చి గొప్పగా ఆదరించిన కల్నల్ మెకంజీని 'తలంచాను'. నిజానికి వీరి కృషిని ప్రత్యేక అధ్యయనం ద్వారా వెలికి తీయాల్సింది ఉంది. కైఫియతుల గురించి ఒక మేరకు అవగాహన వున్నప్పటికి ఒక ప్రక్రియగా అవి రూపొందిన విధానం, వాటి లోతులు, విశేషాలు నాకేమీ తెలీదు. అంటే ఒక్క.............© 2017,www.logili.com All Rights Reserved.