మాట్లాడడానికి ఎదురుగా ఒకరుండాలి మాట్లాడకపోయినా ఎదురుగా ఒకడుంటే చాలు - మనిషి కాదు ఒక బొమ్ముండా చాలు. ఒక బ్రహ్మజెముడు పోదుండా చాలు. ముళ్ళతో మెరుస్తున్న పండిన దాని కాయ కళ్ళు చాలు - తెల్లని శూన్యంతో ఏం మాట్లాడగలం తెగిపడుతున్న వేలవేల తెరలతో ఏం మాట్లాడగలం. చిన్నప్పుడు బర్రెల మధ్య పడుకున్నప్పుడు ఎంత బావుండేది అవి మాట్లాడేవి, ప్రేమించేవి కసురుకునేవి దయ చిప్పిలుతున్న కళ్ళతో చూసేవి ఎదురుగా ఎవరూలేని ఒక ఖాళీ జాగాలో మనిషి మరణిస్తున్నాడు.. మనిషి మరణిస్తున్నాడు...
పక్కకి ఒత్తగిలితే తగిలిందో వాక్యం పూర్వం ఒక రాజు తనకీ పెళ్ళానికీ మధ్య కత్తి నాటాడట పక్క మధ్యలో - ఎవరు కదిలినా రక్తం పలుకుతుంది పండిన వేపకాయ హృదయం తీయతీయగా చేదు చేదుగా తడితడిగా. అంటే కవిత్వం రాయటమంటే ఖడ్గంతో సహజీవనం చెయ్యటం - మొద్దుబారటానికీ వీల్లేదు మోడుగా మిగాలటానికీ వీల్లేదు. కొంచెం స్వేచ్చ కావాలి మనిషి మనిషని చెబటానికి పశువుని పశువని చెబటానికి కొంచెం స్వేచ్చ కావాలి. రాత్రిని రాత్రని చెబటానికి కొంచెం స్వేచ్చ కావాలి. రెక్కలల్లార్చి గాల్లో ఎగరటానికి...
మాట్లాడడానికి ఎదురుగా ఒకరుండాలి మాట్లాడకపోయినా ఎదురుగా ఒకడుంటే చాలు - మనిషి కాదు ఒక బొమ్ముండా చాలు. ఒక బ్రహ్మజెముడు పోదుండా చాలు. ముళ్ళతో మెరుస్తున్న పండిన దాని కాయ కళ్ళు చాలు - తెల్లని శూన్యంతో ఏం మాట్లాడగలం తెగిపడుతున్న వేలవేల తెరలతో ఏం మాట్లాడగలం. చిన్నప్పుడు బర్రెల మధ్య పడుకున్నప్పుడు ఎంత బావుండేది అవి మాట్లాడేవి, ప్రేమించేవి కసురుకునేవి దయ చిప్పిలుతున్న కళ్ళతో చూసేవి ఎదురుగా ఎవరూలేని ఒక ఖాళీ జాగాలో మనిషి మరణిస్తున్నాడు.. మనిషి మరణిస్తున్నాడు... పక్కకి ఒత్తగిలితే తగిలిందో వాక్యం పూర్వం ఒక రాజు తనకీ పెళ్ళానికీ మధ్య కత్తి నాటాడట పక్క మధ్యలో - ఎవరు కదిలినా రక్తం పలుకుతుంది పండిన వేపకాయ హృదయం తీయతీయగా చేదు చేదుగా తడితడిగా. అంటే కవిత్వం రాయటమంటే ఖడ్గంతో సహజీవనం చెయ్యటం - మొద్దుబారటానికీ వీల్లేదు మోడుగా మిగాలటానికీ వీల్లేదు. కొంచెం స్వేచ్చ కావాలి మనిషి మనిషని చెబటానికి పశువుని పశువని చెబటానికి కొంచెం స్వేచ్చ కావాలి. రాత్రిని రాత్రని చెబటానికి కొంచెం స్వేచ్చ కావాలి. రెక్కలల్లార్చి గాల్లో ఎగరటానికి...© 2017,www.logili.com All Rights Reserved.