Prasiddha Balageyalu

By Dr K Prabhakara Reddy (Author)
Rs.100
Rs.100

Prasiddha Balageyalu
INR
MANIMN3087
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                   

                                  తల్లి గుండెలోని పట్టరాని తీపినంతా రాగమయం చేసిన మధుర నాదాలు-జోలలై, గుండె ఊసులై, రసధారలై-ఎన్నెన్ని జోలలు! ఎన్నెన్ని లాలింపు పాటలు! ప్రకృతిలోని పంచభూతాలలోని శృతిలయలన్నీ మేళవింపుగా అక్షరాలు కూర్చుకొన్న పాలపాటలు! -

                                  ఊయేల పాటలేనా? ఊహ తెలిసిన పిల్లలకు, ఆటా, మాటా నేర్చిన 
పిల్లలకు మరెన్నో పాటల ఊటలు కావాలి. ఆట ఆటకూ ఒక పాట-సరసాలకూ, సరదాలకూ పాట-వెక్కిరింపులకూ వేళాకోళాలకూ పాట - పండుగ పండుగకూ ఒక్కొక పాట -

                                ఇట్లా-బిడ్డలపట్ల తీరని తమకంతో తల్లులు పాడుకొనేవి కొన్ని, తల్లుల ఒడి వీడి ఆటలు మరిగిన పిల్లలు చిందుకూ గెంతుకూ తందాన పాటగా పాడుకొనేవి కొన్ని -

                                 ఏనాటివి ఈ పాటలన్నీ! ఎవరు కట్టి ఉంటారు ఈ బాణీలన్నీ! వారి ఊరూ పేరూ తెలియదు కాని, ఆదికాలం నుంచీ బిడ్డలను కని పెంచిన తల్లుల ఉల్లాల నుండి, తండ్రుల చిత్తాలనుంచి జాలువారిన అచ్చపు పూదేనె వాకలు - ఈ

పిల్లల పాటలు -

                                  ఈ బాలగేయాలను ఈ రూపంలో మనకు అందిస్తున్న సాహితీమూర్తి డాక్టర్ కోడూరు ప్రభాకరరెడ్డి భావ ప్రపూర్ణమైన, పరిశోధనాత్మకమైన, రసవత్తరమైన రచనలతో తెలుగు సాహితిని పరిపుష్టం చేసినవాడు. ప్రౌఢసుందరమైన కవిత్వం ఒకచేత - పరిశోధనా ప్రవృత్తి మరొకచేత - సవ్యసాచిగా సాహిత్య సృజనకు పూనుకొన్నవాడు; ఇప్పటికే గద్య, పద్య, గేయ, నాటికాప్రక్రియలలో-స్వీయ రచనలు, మహాకవులైన వారి సాహిత్య వ్యక్తిత్వ విశ్లేషణలతో కూడిన గ్రంథాలు - ఎన్నో వెలువరించి సాహిత్య లోకంలో సుస్థిర పీఠం వేసుకు కూర్చున్న వాడు! ఇప్పుడీ బాలగేయ సంకలన కర్తగా, బాలగేయ వ్యాఖ్యాతగా మరోమారు మనముందుకు వస్తున్నవాడు - శిశువైద్య ప్రముఖుడు డాక్టర్ కోడూరు ప్రభాకరరెడ్డి

                                                                                                                                          - సి. వేదవతి

                                                      తల్లి గుండెలోని పట్టరాని తీపినంతా రాగమయం చేసిన మధుర నాదాలు-జోలలై, గుండె ఊసులై, రసధారలై-ఎన్నెన్ని జోలలు! ఎన్నెన్ని లాలింపు పాటలు! ప్రకృతిలోని పంచభూతాలలోని శృతిలయలన్నీ మేళవింపుగా అక్షరాలు కూర్చుకొన్న పాలపాటలు! -                                  ఊయేల పాటలేనా? ఊహ తెలిసిన పిల్లలకు, ఆటా, మాటా నేర్చిన పిల్లలకు మరెన్నో పాటల ఊటలు కావాలి. ఆట ఆటకూ ఒక పాట-సరసాలకూ, సరదాలకూ పాట-వెక్కిరింపులకూ వేళాకోళాలకూ పాట - పండుగ పండుగకూ ఒక్కొక పాట -                                 ఇట్లా-బిడ్డలపట్ల తీరని తమకంతో తల్లులు పాడుకొనేవి కొన్ని, తల్లుల ఒడి వీడి ఆటలు మరిగిన పిల్లలు చిందుకూ గెంతుకూ తందాన పాటగా పాడుకొనేవి కొన్ని -                                  ఏనాటివి ఈ పాటలన్నీ! ఎవరు కట్టి ఉంటారు ఈ బాణీలన్నీ! వారి ఊరూ పేరూ తెలియదు కాని, ఆదికాలం నుంచీ బిడ్డలను కని పెంచిన తల్లుల ఉల్లాల నుండి, తండ్రుల చిత్తాలనుంచి జాలువారిన అచ్చపు పూదేనె వాకలు - ఈ పిల్లల పాటలు -                                   ఈ బాలగేయాలను ఈ రూపంలో మనకు అందిస్తున్న సాహితీమూర్తి డాక్టర్ కోడూరు ప్రభాకరరెడ్డి భావ ప్రపూర్ణమైన, పరిశోధనాత్మకమైన, రసవత్తరమైన రచనలతో తెలుగు సాహితిని పరిపుష్టం చేసినవాడు. ప్రౌఢసుందరమైన కవిత్వం ఒకచేత - పరిశోధనా ప్రవృత్తి మరొకచేత - సవ్యసాచిగా సాహిత్య సృజనకు పూనుకొన్నవాడు; ఇప్పటికే గద్య, పద్య, గేయ, నాటికాప్రక్రియలలో-స్వీయ రచనలు, మహాకవులైన వారి సాహిత్య వ్యక్తిత్వ విశ్లేషణలతో కూడిన గ్రంథాలు - ఎన్నో వెలువరించి సాహిత్య లోకంలో సుస్థిర పీఠం వేసుకు కూర్చున్న వాడు! ఇప్పుడీ బాలగేయ సంకలన కర్తగా, బాలగేయ వ్యాఖ్యాతగా మరోమారు మనముందుకు వస్తున్నవాడు - శిశువైద్య ప్రముఖుడు డాక్టర్ కోడూరు ప్రభాకరరెడ్డి                                                                                                                                           - సి. వేదవతి

Features

  • : Prasiddha Balageyalu
  • : Dr K Prabhakara Reddy
  • : Amaravathi Publications
  • : MANIMN3087
  • : Paperback
  • : Nov-2019
  • : 92
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Prasiddha Balageyalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam