జనహితం, దేశహితం నిమిత్తం నీకు కలిగే నష్టాన్ని లెక్కించరాదని చెప్పడం వల్ల కవి శేషన్ ఎటువైపు నిలిచాడో అర్థమవుతుంది. కొవ్వొత్తి కరుగుతుంది; కానీ వెలుగునిస్తుంది. కవీ అంతే! అయితే ప్రాచీన నిర్వచనం ప్రకారం కవి జ్ఞాని, పండితుడు,భావుకుడు. ఇవన్నీ ఉన్న వారికే సృజనశక్తి ఉంటుంది.
స్వామి వివేకానంద శిష్యులు బుద్ధానంద ఇలా వివేచిస్తారు. ఒక వ్యక్తిలో సంకల్పశక్తి నిర్మాణం కావాలంటే మొదట అతడు సమ్యక్ చింతనం చేయాలి. దానితో సరియైన దారిని ఎంచుకోగలుగుతాడు. ఆ తర్వాత అతను ప్రగాఢ చింతనం చేయాలి. దేనితో అంతరాంతరాల్లోకి వెళ్లిపోగలుగుతాడు. ఆ తర్వాత స్వేఛ్చాచింతనం చేస్తాడు. తనదైన సొంత గొంతుక విప్పే అవకాశం కలుగుతుంది. అపుడే అతని సృజనశక్తి వల్ల బ్రహ్మాండమైన వినూత్నావిష్కరణలు జరుగుతాయి. ఈ విషయం ఒక సాహిత్యానికే కాదు. అన్ని వినూత్నాంశాలకు వర్తిస్తుంది. ఇవన్నీ క్రమ పరినితిలో మహాకవి శేషేంద్రశర్మలో కనిపిస్తాయి. సృజనశక్తి మరియు సంకల్పశక్తి కారణంగానే నాదేశం - నా ప్రజల అనే ఆధునిక మహాభారతాన్ని వారు నిర్మించగలిగారు. మేనిఫెస్టోలో చెప్పిన ఈ అంశాలు నాదేశం - నా ప్రజలకు సరిగా వర్తిస్తాయి.
జనహితం, దేశహితం నిమిత్తం నీకు కలిగే నష్టాన్ని లెక్కించరాదని చెప్పడం వల్ల కవి శేషన్ ఎటువైపు నిలిచాడో అర్థమవుతుంది. కొవ్వొత్తి కరుగుతుంది; కానీ వెలుగునిస్తుంది. కవీ అంతే! అయితే ప్రాచీన నిర్వచనం ప్రకారం కవి జ్ఞాని, పండితుడు,భావుకుడు. ఇవన్నీ ఉన్న వారికే సృజనశక్తి ఉంటుంది. స్వామి వివేకానంద శిష్యులు బుద్ధానంద ఇలా వివేచిస్తారు. ఒక వ్యక్తిలో సంకల్పశక్తి నిర్మాణం కావాలంటే మొదట అతడు సమ్యక్ చింతనం చేయాలి. దానితో సరియైన దారిని ఎంచుకోగలుగుతాడు. ఆ తర్వాత అతను ప్రగాఢ చింతనం చేయాలి. దేనితో అంతరాంతరాల్లోకి వెళ్లిపోగలుగుతాడు. ఆ తర్వాత స్వేఛ్చాచింతనం చేస్తాడు. తనదైన సొంత గొంతుక విప్పే అవకాశం కలుగుతుంది. అపుడే అతని సృజనశక్తి వల్ల బ్రహ్మాండమైన వినూత్నావిష్కరణలు జరుగుతాయి. ఈ విషయం ఒక సాహిత్యానికే కాదు. అన్ని వినూత్నాంశాలకు వర్తిస్తుంది. ఇవన్నీ క్రమ పరినితిలో మహాకవి శేషేంద్రశర్మలో కనిపిస్తాయి. సృజనశక్తి మరియు సంకల్పశక్తి కారణంగానే నాదేశం - నా ప్రజల అనే ఆధునిక మహాభారతాన్ని వారు నిర్మించగలిగారు. మేనిఫెస్టోలో చెప్పిన ఈ అంశాలు నాదేశం - నా ప్రజలకు సరిగా వర్తిస్తాయి.© 2017,www.logili.com All Rights Reserved.