నాది వ్యవసాయ కుటుంబం మా నాయన సాధారణ రైతు మంచి కష్టజీవి. నన్ను వ్యవసాయంలో నలగదీశాడు. వ్యవసాయ జీవితంలోనుంచి సాహిత్య జీవితంలో ప్రవేశించిన నాకు సాహిత్యంలో వ్యవసాయ రంగం ప్రస్తావన వస్తే పరవశం కలుగుతుంది. వ్యవసాయ రంగం ముగ్గురి కలయిక. రైతు, వృత్తికారులు, కూలీలు. ఈ ముగ్గురు కలిస్తేనే వ్యవసాయ రంగం. ఈ మూడు రకాల జీవితాలు సాహిత్యంలో ఎక్కడ కనిపించినా నేను నా అనుభవాలను స్మరించుకుంటాను. -
పురాణాలలో గొడ్డళ్ళు, గదలు, అమ్ముల పొదులు ధరించే పాత్రలకన్నా నాగలి ధరించిన బలరాముడంటే నాకిష్టం. మహాభారతంలో సభాపర్వంలో నారదుడు ధర్మరాజుకు బోధించే ప్రజాపాలన సూత్రాలలో రైతు ప్రస్తావన చేస్తాడు. ఎర్రన హరివంశంలో రేపల్లె ప్రజల జీవిత చిత్రణ ఉంది. పోతన భాగవతంలో గ్రామీణ జీవితం కనిపిస్తుంది. పాండురంగ మహాత్మ్యం వంటి ప్రబంధాలలో అక్కడక్కడ రైతుల ప్రస్తావన వస్తుంది. ఆముక్తమాల్యదలో రాయలు రైతులను వర్ణించాడు. శుకసప్తతి, హంసవిశంతి వంటి కథాకావ్యాలలో వ్యవసాయరంగ విశేషాలు కనిపిస్తాయి. వేమన శ్రమసిద్ధాంతం చెప్పాడు. పోతులూరి వీరబ్రహ్మం శ్రామికులను గౌరవించమన్నాడు. ఇవన్నీ చదివినప్పుడు నేను ఎవరి వారసుడనో తెలిసివస్తుంది.
నాది వ్యవసాయ కుటుంబం మా నాయన సాధారణ రైతు మంచి కష్టజీవి. నన్ను వ్యవసాయంలో నలగదీశాడు. వ్యవసాయ జీవితంలోనుంచి సాహిత్య జీవితంలో ప్రవేశించిన నాకు సాహిత్యంలో వ్యవసాయ రంగం ప్రస్తావన వస్తే పరవశం కలుగుతుంది. వ్యవసాయ రంగం ముగ్గురి కలయిక. రైతు, వృత్తికారులు, కూలీలు. ఈ ముగ్గురు కలిస్తేనే వ్యవసాయ రంగం. ఈ మూడు రకాల జీవితాలు సాహిత్యంలో ఎక్కడ కనిపించినా నేను నా అనుభవాలను స్మరించుకుంటాను. - పురాణాలలో గొడ్డళ్ళు, గదలు, అమ్ముల పొదులు ధరించే పాత్రలకన్నా నాగలి ధరించిన బలరాముడంటే నాకిష్టం. మహాభారతంలో సభాపర్వంలో నారదుడు ధర్మరాజుకు బోధించే ప్రజాపాలన సూత్రాలలో రైతు ప్రస్తావన చేస్తాడు. ఎర్రన హరివంశంలో రేపల్లె ప్రజల జీవిత చిత్రణ ఉంది. పోతన భాగవతంలో గ్రామీణ జీవితం కనిపిస్తుంది. పాండురంగ మహాత్మ్యం వంటి ప్రబంధాలలో అక్కడక్కడ రైతుల ప్రస్తావన వస్తుంది. ఆముక్తమాల్యదలో రాయలు రైతులను వర్ణించాడు. శుకసప్తతి, హంసవిశంతి వంటి కథాకావ్యాలలో వ్యవసాయరంగ విశేషాలు కనిపిస్తాయి. వేమన శ్రమసిద్ధాంతం చెప్పాడు. పోతులూరి వీరబ్రహ్మం శ్రామికులను గౌరవించమన్నాడు. ఇవన్నీ చదివినప్పుడు నేను ఎవరి వారసుడనో తెలిసివస్తుంది.
© 2017,www.logili.com All Rights Reserved.