యమునా నదికి నావ నడుపుతున్న మత్స్యగంధితో పరాశర మహర్షి సంగమించడంతో సద్యోగర్భంలో దండక మండలాలతో వ్యాసమహర్షి పుట్టుకొచ్చాడు. బిడ్డ పుట్టినా మత్స్యగంధికి కన్యాత్వం చెడలేదు. తర్వాత ఆవిడ శ౦తన మహారాజుకు భార్యయై ఇద్దరు మగబిడ్డల్ని కన్నది. వారు చనిపోతే వారి భార్యలై విధవలైన మరదండ్రతో సంగమించి వ్యాసమహర్షి ధృతరాష్ట్రుణ్ణి, పాండురాజును కన్నాడు. పాండురాజు భార్యలు కుంతీ మాద్రీ పాండురాజు౦డగానే పరపురుషులవల్ల పంచ పాండవులను కన్నారు. వారైదుగురు ఒకే స్త్రీకి భర్తలుగా ఉండి పిల్లల్ని కన్నారు. ఇదీ వ్యాస వంశ చరిత్ర. దీన్ని వ్యాసమహర్షే వ్రాసికొన్నాడు. ఇది పంచమ వేదం అని పేరు పడింది.
ఈ కథ వింటే పాపాలు పోతాయంటారు పెద్దలు, వింటే భారతమే వినాలి తింటే గారెలే తినాలనే నానుడి ఉంది. ఇలా చెప్పడంలో ఏదో ధర్మ సూక్ష్మం ఉండాలి అని పూర్వ కవి ఒకరు వ్రాసిన శ్లోకం కూడా ప్రచారంలో ఉంది.
ఆ ధర్మ సూక్ష్మమేదో ఈ అంతరార్ధ మహాభారతంలో శర్మగారు వెల్లడించారు, చదివి తరించండి.
వీరు రామాయణ భాగవతాదులకు కూడా అంతరార్ధం వ్రాసేరు. ఈ గ్రంధత్రయం చదివితే రామాయణ భాగవత భారతం మీద కువిమర్శలు వుండవు.
- కళాప్రపూర్ణ వేదుల సూర్యనారాయణశర్మ
యమునా నదికి నావ నడుపుతున్న మత్స్యగంధితో పరాశర మహర్షి సంగమించడంతో సద్యోగర్భంలో దండక మండలాలతో వ్యాసమహర్షి పుట్టుకొచ్చాడు. బిడ్డ పుట్టినా మత్స్యగంధికి కన్యాత్వం చెడలేదు. తర్వాత ఆవిడ శ౦తన మహారాజుకు భార్యయై ఇద్దరు మగబిడ్డల్ని కన్నది. వారు చనిపోతే వారి భార్యలై విధవలైన మరదండ్రతో సంగమించి వ్యాసమహర్షి ధృతరాష్ట్రుణ్ణి, పాండురాజును కన్నాడు. పాండురాజు భార్యలు కుంతీ మాద్రీ పాండురాజు౦డగానే పరపురుషులవల్ల పంచ పాండవులను కన్నారు. వారైదుగురు ఒకే స్త్రీకి భర్తలుగా ఉండి పిల్లల్ని కన్నారు. ఇదీ వ్యాస వంశ చరిత్ర. దీన్ని వ్యాసమహర్షే వ్రాసికొన్నాడు. ఇది పంచమ వేదం అని పేరు పడింది. ఈ కథ వింటే పాపాలు పోతాయంటారు పెద్దలు, వింటే భారతమే వినాలి తింటే గారెలే తినాలనే నానుడి ఉంది. ఇలా చెప్పడంలో ఏదో ధర్మ సూక్ష్మం ఉండాలి అని పూర్వ కవి ఒకరు వ్రాసిన శ్లోకం కూడా ప్రచారంలో ఉంది. ఆ ధర్మ సూక్ష్మమేదో ఈ అంతరార్ధ మహాభారతంలో శర్మగారు వెల్లడించారు, చదివి తరించండి. వీరు రామాయణ భాగవతాదులకు కూడా అంతరార్ధం వ్రాసేరు. ఈ గ్రంధత్రయం చదివితే రామాయణ భాగవత భారతం మీద కువిమర్శలు వుండవు. - కళాప్రపూర్ణ వేదుల సూర్యనారాయణశర్మ
© 2017,www.logili.com All Rights Reserved.